Breaking News

నగరంలో ఘనంగా ఖాదీ మహోత్సవం

-రూ. 1.50 కోట్ల మైలురాయిని దాటిన విక్రయాలు
-ఇప్పటికే 7 రోజులపాటు విజయవంతంగా నిర్వహణ ముగింపు దశకు చేరుకున్న ప్రదర్శన – చివరి 3 రోజులే
-ఖాదీని ఆదరిద్దాం – వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు చేయూత నిద్దాం
-ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్‌లో ర్యాంప్ వాక్‌కు ఘన స్వాగతం
-ఆకట్టుకున్న మహిళల ఖాదీ ర్యాంప్ వాక్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని మేరిస్ స్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ‘ఖాదీ మహోత్సవం’ ప్రదర్శన నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోందని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డా. ఎస్. గ్రీప్, సహాయ సంచాలకులు ఆర్.ఎల్.ఎన్. మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
అదిరిపోయిన ఖాదీ ర్యాంప్ వాక్ ఖాదీ వస్త్రాలతో మహిళలు హొయలొలికిస్తూ ప్రదర్శించిన ర్యాంప్ వాక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

సంప్రదాయం–ఆధునికతకు సమన్వయ వేదికగా నిలిచిన ఈ ప్రదర్శనలో విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఖాదీ మహోత్సవంలో శనివారం నాటికి దాదాపు రూ. 1.50 కోట్ల (ఒక కోటి 50 లక్షల రూపాయల) విలువైన అమ్మకాలు జరగడం విశేషమన్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన ఖాదీ, చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులు, గ్రామీణ పరిశ్రమల వస్తువులు, సహజసిద్ధమైన ఆహార పదార్థాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయని తెలిపారు.
నగర ప్రజల నుంచి లభిస్తున్న అద్భుత స్పందనతో స్టాల్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నాణ్యమైన ఖాదీ వస్త్రాలు తయారీ ధరలకే లభిస్తుండటంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయన్నారు.
ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించడమే ఈ మహోత్సవం ప్రధాన లక్ష్యమని, ఇప్పటికే కోటిన్నర రూపాయల విక్రయాలు జరగడం తమకు మరింత ఉత్సాహాన్నిస్తోందన్నారు. వినియోగదారులు కేవలం వస్త్రాలకే కాకుండా పర్యావరణహిత ఉత్పత్తుల పట్ల కూడా ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

నగర ప్రజలు ఖాదీ ఉత్పత్తులకు ఎంతో ఆదరణ చూపిస్తున్నారని, మిగిలిన మూడు రోజులు కూడా మరింతగా ఆదరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, అలాగే ప్రధానమంత్రి ఉపాధి హామీ ఉత్పత్తి పథకం (PMEGP) కింద తయారైన ఉత్పత్తులకు ఈ ఎగ్జిబిషన్‌లో మంచి స్పందన లభిస్తోందన్నారు. ఈ ఖాదీ మహోత్సవం ఇంకా మూడు రోజులు మాత్రమే నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చేనేత కార్మికులకు అండగా నిలవాలని వారు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *