Breaking News

దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్…

-ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు అనేకచోట్ల ఇంతవరకు పట్టాలు వేయలేదు ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించరా డబ్బున్నవారికే అన్ని సౌకర్యాలు కల్పిస్తారా?

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి చేసే అవినీతి కార్యక్రమాలు వల్లే దసరాలో ప్రతి ఏడాది దుర్గ గుడి పై అపశృతులు జరుగుతున్నాయని, దసరా ఉత్సవాలు కి ఒక రోజు ముందు అంతరాలయంలో కరెంట్ షాక్ తగిలి ఎలక్ట్రీషియన్ మృతి చెందడం బాధాకరమని, అవధూత స్వామి ని దర్శించు కోకుండా కొండపై మూసివేసినందున ఈ ఘటన జరిగిందని, దుర్గ గుడి పై అందరూ చర్చించుకుంటున్నారని, దీనికి కారణం EE భాస్కర్ అని, ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం పండితులను స్థపతులును సంప్రదించకుండా ఇటువంటి నిర్ణయాలు చేస్తున్నారని, ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు అనేకచోట్ల ఇంతవరకు పట్టాలు వేయలేదు ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించరా డబ్బున్నవారికే అన్ని సౌకర్యాలు కల్పిస్తారాని, ఉచిత బస్సు సౌకర్యం ద్వారా సామాన్య భక్తులను కొండపైకి తీసుకువచ్చేలా గా చర్యలు తీసుకోవాలి. వివిఐపిల కార్లను మరియు ప్రైవేటు వ్యక్తుల కార్లను కొండపైకి అనుమతించడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని, దసరా ఉత్సవాల శోభ కోసం ఇంత వరకు మామిడితోరణాలు అలంకరించ కపోవడం పై వీరికి అమ్మ పై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందని, కాంట్రాక్టర్లు దోచుకు పెట్టడం పై ఉన్న శ్రద్ధ అమ్మకు మామిడితోరణాలు కట్టించడం పై మాత్రమే అధికారులకు లేదని, కే.ఎల్ టెక్నికల్ శానిటేషన్ విభాగం అక్రమంగా 18 నెలల నుంచి కొనసాగిస్తూ నేడు మరల దసరా ఉత్సవానికి రోజుకు 400 మంది చొప్పున ఈ పది రోజులకి 20 లక్షల రూపాయల అక్రమ కాంట్రాక్ట్ కట్టబెట్టడం ఎందుకు వేరే ఎవరికైనా ఇవ్వచ్చు కదా kl టెక్నికల్ మీద అంత ప్రేమ ఎందుకుఅని? మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు మాజి ఈఓ సురేష్ బాబు బినామీల సంస్థ అనా? అని, బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్, అమ్మవారికి మొబైల్ క్యాంటీన్ కాంట్రాక్ట్ పాడి 50 లక్షల రూపాయలు చెల్లించకుండా ఎగ్గొట్టిన ఈ జొన్నలగడ్డ రమేష్ కుమార్ అనే కాంట్రాక్టర్కు, దసరా ఉత్సవానికి వచ్చే అధికారులకు ఉచితంగా వండి ఇవ్వగలరాఅని, పచారీ సరుకుల అన్నీ దేవస్థానం వారు ఇస్తారు ఇతను ఉచితంగా వండి వార్చి ఇవ్వడం వెనక కుట్ర ఉందని, పచారి సరుకులు కొట్టయడానికి ఇదంతా అని, ఎన్ని లక్షల రూపాయలు పోతాయోఅని, మల్లాది విష్ణు ఈ జొన్నలగడ్డ రమేష్ కుమార్ ని సిఫార్ చేస్తూ లేఖాఇచ్చారు అదే చేత్తో 68 లక్షల రూపాయలు చెల్లించమని కూడా తమరు ఒక లెఖ జారీ చేసి అమ్మవారికి నష్టం రాకుండా చేయగలరని , టెండర్లు పిలిచి తర్వాత ఉచిత డ్రామా ఏంటి 50 లక్షల రూపాయలు ఎగ్గొట్టి కాజేసేందుకు ఇదొక పన్నాగం ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీనిపై సమాధానం చెప్పాలి. కలెక్టర్ నివాస్, పోలీస్ కమిషనర్ బత్తిని శ్రీనివాస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సమన్వయంతో సమర్థవంతంగా దసరా ఉత్సవాలు నిర్వహించాలని కోరుతున్నామని, సామాన్య భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మహేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి శంకర్ , జనసేన నాయకులు మరుపిళ్ళ చిన్న రావు, p. శ్రీను, నూకరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *