Breaking News

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత….

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం 34 వ డివిజన్ కు చెందిన 56 సంవత్సరాల గట్టు పుల్లమ్మ కిడ్నీ కి సంబంధించిన వ్యాధితో బాధ పడుతోంది.. ఆమెకు సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఆర్థికంగా స్తోమత లేని వారు కావడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు.. వెంటనే ఎమ్మెల్యే సీఎం ఆర్ ఎఫ్ కు లేఖ రాసారు. పుల్లమ్మ కు వైద్య ఖర్చుల నిమిత్తం అవసరమయ్యే 9,80,000/_ రూపాయలు మంజూరు చేయాలని లేఖ రాసారు. దీనికి సంబంధించిన ఎల్వోసీ పత్రాలను సుజనా చౌదరి కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకురాలు మల్లేపు విజయలక్ష్మి, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నాయకులు, సుజనా మిత్రలు పాల్గొన్నారు.. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *