Breaking News

ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లతో సామాజిక భద్రత

– జిల్లాలో 2,27,933 మంది ల‌బ్ధిదారుల‌కు రూ. 98.42 కోట్లు
– క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా అర్హులైన వృద్ధులు, విభిన్న ప్ర‌తిభావంతులు త‌దిత‌రుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సామాజిక భద్రతను కల్పిస్తోందని, ప‌థ‌కాన్ని జిల్లాలో అత్యంత పార‌దర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో అమ‌లుచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. శ‌నివారం పండ‌గ వాతావ‌ర‌ణంలో పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌ర‌గ్గా… 64వ డివిజ‌న్ కండ్రిక‌లో జ‌రిగిన పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి పాల్గొన్నారు. పింఛ‌నుదారుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగుల ద్వారా పింఛ‌నుమొత్తాన్ని అందిస్తున్న తీరును ప‌రిశీలించారు. ల‌బ్ధిదారులైన వ‌యోవృద్ధుల‌ను ఆత్మీయంగా ప‌ల‌క‌రించి క‌ష్ట‌సుఖాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్లు పేద‌ల‌కు వ‌ర‌మ‌ని.. స‌మాజంలో గౌర‌వప్ర‌దంగా జీవించేందుకు ఈ స‌హాయం ఎంత‌గానో తోడ్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. జిల్లాలో 2,27,933 మంది ల‌బ్ధిదారుల‌కు దాదాపు రూ. 98.42 కోట్ల మేర పంపిణీ చేయ‌డం జ‌రుగుతోంద‌ని.. ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ‌చేసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప‌నిచేస్తున్నార‌ని, నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌త్యేక అధికారులు నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటోంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *