Breaking News

పేద‌లకు వైద్యం, విద్య ప‌ట్ల కూట‌మి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌

-సంక్షేమం అమ‌లులో దేశానికే ఏపీ రోల్ మోడ‌ల్
-ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్యం, విద్య‌ను అందించ‌డంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటుంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. అద్దంకిలో మంత్రి గొట్టిపాటి శ‌నివారం ప‌ర్య‌టించారు. పుట్టావారి పాలెంలోని అతిథి గృహంలో 85 మంది ల‌బ్ధిదారుల‌కు మంత్రి గొట్టిపాటి ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ., ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను, పేద‌ల‌కు కార్పొరేట్ వైద్యాన్నిఅందిస్తున్నామ‌ని తెలిపారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ‌ల‌హీన వ‌ర్గాల వారికి ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండ‌గా నిలుస్తుంద‌ని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. ఆస్ప‌త్రుల ఖ‌ర్చుతో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకూడ‌ద‌నే, ఆరోగ్య భ‌ద్ర‌త‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని వివ‌రించారు. ఇటువంటి ఎన్నో కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌తో, పేద‌ల‌కు సంక్షేమాన్ని అందించ‌డంలో దేశానికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రోల్ మోడ‌ల్ గా నిలుస్తుంద‌ని ఆయ‌న‌ వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ మాట్లాడుతూ., స్వార్థ రాజ‌కీయాల కోసం దేవుడిని కూడా వాడుకుంటున్న నీచ చ‌రిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది అని విమ‌ర్శించారు. చ‌ట్ట స‌భ‌ల్లో దేవుడి ఫొటోతో రాజ‌కీయ నినాదాలు చేయ‌డం దేశంలోనే ఇంత వ‌ర‌కు ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇటువంటి విధానాల‌ను ప్ర‌జ‌లు కూడా ఉపేక్షించ‌ర‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మ‌హాప‌చారం చేసి కూడా బుకాయించ‌డం కేవ‌లం వైసీపీ నేత‌ల‌కు మాత్ర‌మే చెల్లుతుంద‌ని మంత్రి గొట్టిపాటి ఎద్దేవా చేశారు. ఏదేమైనా వైఎస్సార్ కాంగ్రెస్ పాపాల‌ను భ‌రించ‌డానికి ప్ర‌జ‌లెవ‌రూ సిద్ధంగా లేర‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో ప‌లువురు కూట‌మి నేత‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *