Breaking News

పౌరసరఫరాల సేవల్లో సంస్కరణ బాట!!

-అసెంబ్లీ లో జరిగిన చర్చ సందర్బంగా సమాధానం ఇచ్చిన ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
పౌరసరఫరాల సేవలను ఆదర్శవంతంగా ప్రజలకు అందజేయడమే కాకుండా, సేవల్లో గణనీయమైన సంస్కరణలను కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ పనితీరుపై శాసనసభలో సభ్యులు లేవనెత్తిన చర్చ సందర్భంగా మనోహర్ సమాధానం ఇస్తూ శాఖ పనితీరును వివరించారు. అలాగే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత శాఖలో తీసుకువచ్చిన మార్పులు, సంస్కరణల గురించి ప్రస్తావించారు. వివరాలు ఆయన మాటల్లో… గతంలో మాదిరి కాకుండా రాష్ట్రంలో ఉన్న 1.45 రేషన్ కార్డుల లబ్ధిదారులకు సకాలంలో సేవలు అందిస్తున్నాం. ఏటీఎం తరహాలో స్మార్ట్ రేషన్ కార్డు తీసుకువచ్చాం. క్యూఆర్ కోడ్ ద్వారా లబ్ధిదారుల సమస్త వివరాలు, సరకులు తీసుకున్న రికార్డు దానిలో పొందుపరుస్తున్నాం. గతంలో ఎన్నడూ లేనట్లుగా గత ఖరీఫ్ లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొని, ఈ రోజు వరకు 45.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. మొత్తం 7,47,940 మంది రైతులకు రూ. 10,810 కోట్ల ధాన్యం బకాయిల సొమ్ము చెల్లించాం. దీనిలో 8 గంటల్లోపు రూ. 5,8333 కోట్లు ధాన్యం సొమ్ములు పడటం రికార్డు. 24 గంటల్లోపు 93 శాతం మందికి చెల్లింపులు పూర్తయ్యాయి. గతంలో ఎన్నడు లేని విధంగా 11 జిల్లాల్లో 100% ధాన్యం కొనుగోలు పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ రికార్డు. ప్రతి నెల ఒకటో తారీఖు కన్నా ముందే వికలాంగులు, వృద్ధులు ఉన్న 16.35 లక్షల కార్డులకు ఇంటింటికి వెళ్లి పౌరసరఫరాల సేవలను అందిస్తున్నాం. ఇంటింటికీ పౌరసరఫరాలు అనే పేరుతో గత ప్రభుత్వం ఎండీయూ వాహనాలను తీసుకొచ్చి విలువైన ప్రజాధనం వృధా చేసింది. ఆ వ్యవస్థను పూర్తిగా తొలగించి ప్రజాధనాన్ని ఆదా చేయడంతో పాటు పౌరసరఫరాల వ్యవస్థను పటిష్టం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఆహార భద్రతలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు చిరు ధాన్యాలను పౌరసరఫరాల దుకాణాల్లో పంపిణీ చేస్తున్నాం. మొదటగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాగి, జొన్నలను అందజేస్తూ ప్రజల ఆహార భద్రతకు ప్రాధాన్యమిస్తున్నాం. భావితరాలకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలనే లక్ష్యంతో మధ్యాహ్న భోజనం కింద పంపుతున్న బియ్యాన్ని 25 కేజీల బస్తాల్లో, నాణ్యమైన బియ్యాన్ని పంపుతున్నాం.  మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రతి తెల్ల కార్డు ఉన్న కుటుంబానికి ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఇలా ఎన్నెన్నో వినూత్న సంస్కరణలను పౌరసరఫరాల శాఖలో తీసుకొచ్చాం. ప్రజల ఆహార భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చాం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *