Breaking News

సమస్యను పరిష్కరించడంలో అర్జీదారుని సంతృప్తే లక్ష్యం..

-స్పష్టతతో అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపండి..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి స్వీకరించిన అర్జీలు పరిష్కరించడంలో ఆర్జీదారుని సంతృప్తే లక్ష్యంగా స్పష్టతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను అదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పేజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్వో ఎం లక్ష్మీశ నరసింహంతో కలసి అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాల్సిందేనన్నారు. నిబంధనలను పాటిస్తూ ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సమస్యకు సంబంధించిన శాఖ జిల్లా స్థాయి అధికారి ప్రత్యేక దృష్టి సారించి సమస్యకు స్పష్టతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా పరిష్కారం ఉండాలని, గడుపుతీరిన అర్జీలు ఏ స్థాయిలోను పెండింగ్ ఉండరాదన్నారు. సంతృప్తి కరంగా పరిష్కారం చూపితే ప్రభుత్వ ఆశయం నేరవేరుతుందనే సందేశం ప్రతి అధికారి దృష్టిలో ఉండాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో అర్జీదారులు వినతులను సమర్పిస్తారని, ఆయా ఆర్డీలకు సకాలంలో పరిష్కారం చూపాల్సిన భాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 104 అర్జీలు అందగా.. వీటిలో

పోలీస్- 24, మున్సిపల్ శాఖకు సంబంధించి – 20 పంచాయతీరాజ్- 20, రూరల్ డెవలప్మెంట్ -7, హెల్త్ -5 విద్య- 3, మార్కెటింగ్-3, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ -3, వ్యవసాయం- 2, డ్రామా -2, రోడ్ అండ్ బిల్డింగ్స్ -2, సాంకేతిక విద్య- 2
పౌర సరఫరాలు, ఏపీ సిపిడిసిఎల్, బీసీ కార్పొరేషన్, విభిన్న ప్రతిభావంతులు, ఉపాధి, కార్మిక, ఐసిడిఎస్, సోషల్ వెల్ఫేర్, మైన్స్, ఆర్డబ్ల్యూఎస్, సర్వేలకు సంబంధించి ఒక్కొక్క ఆర్జీ స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *