Breaking News

కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది

-మేడే సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్మిక, కర్షక సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అపారమని, వారి కష్టం లేకుండా ఏ రంగం ముందుకు సాగదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూలీలు, కార్మికులు, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, నిర్మాణ రంగ విస్తరణ ఇవన్నీ కార్మికుల శ్రమ ఫలితమేనని ఆయన అన్నారు. వారి కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి వివరించారు. కార్మికులకు భద్రత, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు పెంపు, కనీస వేతనాల అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కొత్త పథకాలు తీసుకొస్తున్నామని చెప్పారు. కర్షకుల గురించి ప్రస్తావిస్తూ, రైతులే దేశానికి అన్నదాతలని, వారి శ్రేయస్సు ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ముఖ్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు మెరుగైన ధరలు, సాగుకు అవసరమైన మద్దతు, ఆధునిక సాంకేతికత అందించడంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రస్తుత కాలంలో కార్మికుల హక్కులను కాపాడటం అత్యంత అవసరమని, సమాజం మొత్తం వారి శ్రమను గౌరవించాల్సిన బాధ్యత ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి కార్మికుడి జీవన ప్రమాణం మెరుగుపడేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

మేడే రోజు కార్మికుల త్యాగాలను, కష్టాలను గుర్తుచేసుకునే సందర్భమని, వారి సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి పథంలో కార్మికులు, కర్షకులు భాగస్వాములై ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్మికులు సురక్షితంగా, గౌరవంగా జీవించే సమాజం నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *