Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

-ఎన్డీఏ కార్యాలయంలో మూడో రోజు ప్రజా దర్బార్ కు విశేష స్పందన
-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ ఎన్డీఏ కార్యాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది.. శుక్రవారం జరిగిన ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఏపీ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్ బాబు, 37 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు పోలిశెట్టి శివ, 47 వ డివిజన్ యస్ సీ సెల్ అధ్యక్షుడు చరణ్, జనసేన నాయకుడు పోకల నాగబాబు ప్రజా దర్బార్ లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా సంబంధిత అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు.. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని కూటమి నేతలు తెలిపారు. సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *