Breaking News

వరద నిర్వహణ పనులను పరిశీలించిన అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలో చేపట్టిన వరద నిర్వహణ పనులను APCRDA అడిషనల్ కమిషనర్ కె. కార్తీక్, ఐఏఎస్ శనివారం పరిశీలించారు. అమరావతిలో పాలవాగు అభివృద్ధి పనులు జరుగుతున్న పలు ప్రాంతాలను కార్తీక్ పరిశీలించారు. పనుల పురోగతిని APCRDA, ADCL విభాగ అధికారులు.. కార్తీక్ కి వివరించారు. పరిశీలన అనంతరం, ఆయా పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని కార్తీక్ అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం సమీపిస్తున్నందున వర్షపు నీరు వెళ్లే మార్గాలను కార్తీక్ పరిశీలించి, ఆయా మార్గాలలో జరుగుతున్న పాలవాగు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *