Breaking News

మహిళా ఎంటర్‌ప్రైజెస్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : CEO కరుణ వాకటి, IAS

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ రోజు గౌరవ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)  కరుణ వాకటి, IAS బ్యాంకు లింకేజీ, మహిళా ఎంటర్‌ప్రైజెస్ (Women Enterprises) మరియు స్త్రీనిధి కార్యక్రమాల ప్రగతిపై సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ CEO మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులకు Annual Credit Livelihood Plan (ACLP) ప్రకారం రుణాలు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతకు బ్యాంకు లింకేజీ కార్యక్రమాలు మరింత ప్రభావవంతంగా అమలు కావాలని, మహిళా ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రోత్సహించి గ్రామీణ మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అలాగే స్త్రీనిధి ద్వారా అందిస్తున్న రుణాల పంపిణీ, పెండింగ్ దరఖాస్తులు, రుణ వసూళ్లు మరియు మండలాల వారీ ప్రగతి అంశాలపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన మహిళలకు సకాలంలో రుణాలు అందేలా చర్యలు చేపట్టాలని, స్త్రీనిధి సేవలను మరింత విస్తృతంగా గ్రామీణ ప్రాంతాలకు చేరవేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ మరియు GVBD  హరి ప్రసాద్  మండలాల వారీగా బ్యాంకు లింకేజీ, మహిళా ఎంటర్‌ప్రైజెస్ మరియు స్త్రీనిధి కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. లక్ష్యాల సాధన, రుణాల పంపిణీ, రికవరీలు మరియు వివిధ మండలాల్లో అమలవుతున్న కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. లక్ష్య సాధనలో వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన కార్యాచరణను వివరించారు. మహిళల జీవనోపాధి అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపు, మహిళా వ్యాపార యూనిట్ల స్థాపన మరియు ఆర్థిక స్వావలంబన సాధనలో బ్యాంకులు, స్త్రీనిధి మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని సమావేశంలో అధికారులు ప్రస్తావించారు. ఈ సమీక్ష సమావేశంలో లైవ్‌లీహుడ్ డైరెక్టర్ , ప్రాజెక్ట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (APD) , యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ (RM) , లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (LDM) , వివిధ వాణిజ్య బ్యాంకుల మేనేజర్లు, జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, DPMలు, APMలు, స్త్రీనిధి సిబ్బంది పాల్గొని సంబంధిత అంశాలపై చర్చించారు. మహిళా సంఘాల ఆర్థిక పురోగతి, మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి, జీవనోపాధి అవకాశాల విస్తరణ మరియు స్త్రీనిధి సేవల విస్తరణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించి, నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు అధికారులు కృషి చేయాలని తెలియచేసినారు.
SERP ద్వారా APM లందరికి LAPTOP లు గౌరవ CEO , మరియు డైరెక్టర్లు ద్వారా పంపిణి చేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *