Breaking News

టూరిస్ట్ బస్సుల పన్ను తగ్గింపుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

-మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ ఫలితం.. టూరిస్ట్ బస్సులకు భారీ ఊరట.
-సీఎం చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (AITP) కలిగిన టూరిస్ట్ బస్సులపై త్రైమాసిక పన్నును తగ్గించే ప్రతిపాదనకు నేడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో ఈ ప్రతిపాదనను క్యాబినెట్ పరిశీలించి ఆమోదించింది.

ప్రస్తుతం ప్రతి సీటుకు త్రైమాసికానికి రూ.4,000గా ఉన్న పన్నును రూ.2,500కు తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో టూరిస్ట్ బస్సు యజమానులకు గణనీయమైన ఊరట లభించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు మారిన వాహనాల రిజిస్ట్రేషన్లు తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశం ఏర్పడనుంది.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రవాణా రంగ అభివృద్ధి, టూరిజం ప్రోత్సాహం, వాహన యజమానుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరమని మంత్రి పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల అసోసియేషన్ సభ్యులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని అమరావతి సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన కృతజ్ఞతలు తెలిపి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గౌతమ్ కిరణ్ వైస్ ప్రెసిడెంట్ కెవిఆర్ నాని కార్యదర్శి రాంబాబు కోశాధికారి సందీప్ జాయింట్ కోశాధికారి సువర్చలాదేవి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *