Breaking News

హెవీ డ్రైవింగ్ శిక్షణపై విధించిన ఆంక్షలు తొలగించాలని మంత్రికి వినతి

-హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల కార్యకలాపాలపై ఏర్పడిన సమస్యల నేపథ్యంలో వివిధ జిల్లాలకు చెందిన శిక్షణ కేంద్రాల యజమానులు మంగళవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని తాడేపల్లి లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

పరివాహన్ పోర్టల్‌లో హెవీ డ్రైవింగ్ శిక్షణ ప్రక్రియను నిలిపివేయడం వల్ల శిక్షణార్థులు లైసెన్సులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, శిక్షణ కేంద్రాలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని వారు మంత్రికి వివరించారు. హెవీ డ్రైవింగ్ శిక్షణ ద్వారా అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొంటూ విధించిన ఆంక్షలను తొలగించాలని కోరారు.

వారి వినతిని ఆలకించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులతో చర్చించి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *