Breaking News

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను ఆకే రవికృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి అందజేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను ఈ నివేదికలో వివరించారు. సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్ అంశాలతో పాటు మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా తీసుకుంటున్న కఠిన చర్యలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *