Breaking News

రైతుల ఈ-కెవైసి నమోదులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు : జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరిక

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకంపై లబ్ధిదారుల నుండి మంది స్పందన: మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ-క్రాప్ లో రైతుల ఈ-కెవైసి నమోదులో నిర్లక్ష్యం వహించే చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను హెచ్చరించారు. వ్యవసాయం, జగనన్న గృహ హక్కు పధకం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం, జగనన్న పాలవెల్లువ, మండల ప్రత్యేక అధికారుల పనితీరు, తదితర కార్యక్రమాలపై స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపిడిఓలు, మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ కొన్ని మండలాల్లో 30 శాతానికి పైగా ఈ-క్రాప్ వివరాలకు సంబంధించి రైతుల ఈ-కెవైసి ఇంకా నమోదు కాకపోవడంపై వ్యవసాయాధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. విజయవాడ గ్రామీణ, అగిరిపల్లి, పెదపారుపూడి, మొవ్వ , పామర్రు, ఘంటసాల, తదితర మండలాల్లో రైతుల ఈ-కెవైసి పెండింగ్ లో ఉందన్నారు. రైతుల ఈ-కెవైసి అధిక శాతం పెండింగ్ లో ఉన్న మండలాల్లో యుద్ధప్రాతిపదికన రైతుల ఈ-కెవైసి పూర్తిచేయాలని, తదుపరి సమీక్షలో ఇంకా పెండింగ్ లో ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. జిల్లాలో ఈ నెల 20, 21 వ తేదీలలో ప్రతీ పోలింగ్ కేంద్రం నందు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఓటు హక్కు నమోదు, పేరు మార్పులు, పేర్లు తొలగింపు, తదితరాలకు సంబంధించి ఫారంలు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలో ఇంతవరకు ఓటర్ల జాబితాలో సవరణకు 8723 క్లయింలు వచ్చాయని, వీటిలో అధికంగా మైలవరం మండలంలో ఉన్నాయన్నారు. వీటిని పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 20, 21 వ తేదీలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యకమం సక్రమంగా జరిగే విధంగా ఈఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓ లు పర్యవేక్షించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతీ మంగళ, శుక్రవారాలలో తమకు కేటాయించిన మండలాలలో తప్పనిసరిగా పర్యటించి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును పరిశీలించాలన్నారు. పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పధకం అమలును , గ్రామ/వార్డ్ సచివాలయాలలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించాలన్నారు.
జగనన్న గృహ హక్కు పథకంనకు లబ్ధిదారుల నుండి మంది స్పందన: కలెక్టర్ : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకానికి జిల్లాలో లబ్ధిదారుల నుండి మంచి స్పందన లభిస్తున్నదని కలెక్టర్ నివాస్ చెప్పారు. జిల్లాలో ఇంత వరకు 1824 మంది లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారని, ఇంతవరకు 1.70 కోట్ల రూపాయలు వసూలైనట్లు కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సదివినియోగం చేసుకునేందుకు ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలోని లబ్ధిదారులు ఆసక్తి చూపిస్తున్నాన్నారు. అధికారులు మరింత కృషి చేసి ఈ పధకం నూరు శాతం లక్ష్యాలు సాధించేలా పనిచేయాలన్నారు. ప్రత్యేక అధికారులు సచివాలయ పరిధిలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి ఈ పధకం ఉద్దేశ్యం, ప్రయోజనాలను లబ్దిదారులకు తెలియజేసి లబ్దిదారులందరూ ఈ పధకాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు ఎల్. శివశంకర్, కె. మోహన్ కుమార్, శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *