-గార్బేజ్ సేకరణ అనంతరం క్లాప్ మిత్ర సిబ్బంది రోజువారీ కార్యక్రమం యాప్ లో అప్ లోడ్ చెయ్యాలి..
-పంచాయితీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన పనుల పురోగతిని నియంమించిన బృందాలు పర్యవేక్షింటాయి..
-జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న స్వచ్చసంకల్పంలో భాగంగా జిల్లాలో మెరుగైన పారిశుధ్య సేవలను పటిష్టవంతంగా అమలు చేస్తూ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జగనన్న స్వచ్చ సంకల్పం, స్వచ్చ సర్వేక్షణ, జగనన్న పాలవెల్లువ, వైఎస్సార్ జలకల, ఎన్ఆర్ఈ జిఎస్, ఓటీఎస్, స్పందన వంటి 29 అంశాలపై జెడ్పీ సీఇవో, డీపీవో, పంచాయిరాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులతో జాయింట్ కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెత్త రహిత జిల్లాగా తీర్చి దిద్దేందుకు అధికారులు ప్రణాళికా బద్దంగా జగనన్న స్వచ్చ సంకల్పం అమలు చేస్తూ క్లాప్ కృష్ణా కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలన్నారు. రాష్ట్రంలో క్లాప్ నిర్వహణ కార్యక్రమంలో జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చెయ్యాలన్నారు. జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రజలు, ఎన్జీవోలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. మన ఊరు-మన శుభ్రత అనే అంశంపై గ్రామాల్లో ర్యాలీను నిర్వహించాలన్నారు. ఈమేరకు మన ఊరు- మన శుభ్రత పై పోస్టరు ను కూడా రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు చెత్త సంపద కేంద్రాలను పర్యటించి సిబ్బందికి అవగాహన కల్పిచాలన్నారు. జిల్లాలో బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. క్లాప్ మిత్ర సిబ్బంది ప్రతి రోజు గార్బేజ్ ఇళ్లలో తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేరు చేసి చెత్త నిల్వ కేంద్రాలకు తరళించే విధంగా అధికారులు పర్యవేక్షణ చేస్తుండాలన్నారు. క్లాప్ మిత్ర సిబ్బంది ఇళ్ల నుంచి సేకరించి గార్బేజ్ ను యార్డుకు తరలించిన అనంతరం జగనన్న స్వచ్చసంకల్పం యాప్ లో అప్ లోడ్ చెయ్యాలన్నారు. జగనన్న స్వచ్చసంకల్పం క్లాప్ కార్యక్రమం ద్వారా జిల్లాను చెత్త రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షణ కొరకై డిపీఆర్సీ, కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బందిని నాలుగు బృందాలుగా నియమించామన్నారు. వీరు క్షేత్ర స్థాయిలో ఆయా డివిజన్ పరిధిలో గల మండలాల్లో రోజుకు రెండు గ్రామాలు చొప్పున ఉదయం, మద్యాహ్నం పర్యవేక్షిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తారని జాయింట్ కలెక్టరు పేర్కొన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సూర్య ప్రకాశరావు, డీపీవో జ్యోతి, డ్వామా పీడీ ఎస్ ఈ పంచాయితీరాజ్, ఎస్ ఈ ఆర్ డబ్ల్యూఎస్, డీపీఆర్ సీ ఏవో మురళీకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News