Breaking News

ఎంపీ కేశినేని శివనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూఫీ సేవా సదన్ కార్యాలయంలో ఈరోజు గొల్లపూడినందు ముస్లిం మైనారిటీ మత పెద్దలతో కలిసి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) చిత్రపటానికి పాలాభిషేకం మరియు ప్లే కార్డుల ప్రదర్శన జరిగింది. సూఫీ సేవా సదన్ నిర్వాహకులు రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి, సూఫీ సేవా సదన్ ట్రస్ట్ రాష్ట్ర చైర్మన్ షేక్ మొహమ్మద్ పైజాన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీతో నిర్వహించడం జరిగింది. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంట్ సమావేశాల్లో ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం రూ.101.88 కోట్ల అంచనా వ్యయంతో 7 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు తీసుకెళ్లిన శుభసందర్భంగా ఎంపీ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ముస్లిం మైనారిటీ లకు ప్రతినిత్యం ఆశయ సాధనకు కృషి చేస్తున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ (చిన్ని)కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత గురువులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *