Breaking News

పారామెడికల్ విద్యార్థులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా – తిరుపతి ఎంపీ గురుమూర్తి

-విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి దాడులు చేయించడం అమానవీయం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
హక్కుగా రావాల్సిన స్టైఫండ్‌ను చెల్లించాలని, తమ చదువులు సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతిలోని అలిపిరి వద్ద నిరసన చేపట్టిన పారామెడికల్ విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు.

ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాల చెంత అలిపిరి వద్ద పారామెడికల్ విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన చేపట్టారని తెలిపారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి గొంతును అణచివేసేందుకు పోలీసులతో దాడులు చేయించడం అత్యంత బాధాకరమన్నారు.

ముఖ్యంగా విద్యార్థినుల జుట్టు పట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన దృశ్యాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయని అన్నారు. విద్యార్థులను పోలీసులు చితకబాదిన తీరు చూసి తన మనసు వేదనతో బరువెక్కిందని పేర్కొన్నారు.

గిట్టుబాటు ధరలు చెల్లించాలని రైతులు రోడ్డెక్కితే పోలీసులతో దాడులు చేయించడం చూశామని, ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నించిన విద్యార్థులపై కూడా అదే విధంగా అమానవీయంగా వ్యవహరించడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదన్నారు.

విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిని మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నానని ఎంపీ గురుమూర్తి తెలిపారు. పారామెడికల్ విద్యార్థుల న్యాయమైన పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు రావాల్సిన స్టైఫండ్‌ను చెల్లించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *