-ఎన్నికల అబ్జర్వర్లతో కూటమి పార్టీల జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో పాల్గొన్న దేవినేని ఉమా
రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సంస్థల ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అబ్జర్వర్ దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కూటమి పార్టీల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా శనివారం నాడు రాజమండ్రిలో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల అబ్జర్వర్ దేవినేని ఉమామహేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకట రమణ చౌదరి, బీజేపీ తరుపున బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీక్కి నాగేంద్ర, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన పార్టీ తరఫున మాజీ శాసన సభ్యులు టివి రామారావు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప, ఆత్మ చైర్మన్ రావడ నాగు తదితర నాయకులు పాల్గొని స్థానిక ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు.
స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు, సీట్ల కేటాయింపు తదితర అంశాలపై స్పష్టత వచ్చే వరకు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎక్కడా సమన్వయ లోపానికి తావులేకుండా ఎన్నికల సన్నద్ధత చేపట్టాలని నాయకులు సూచించారు. మండల, నియోజకవర్గ స్థాయిలోనూ మూడు పార్టీల నాయకుల మధ్య నిరంతర సమన్వయం కొనసాగించాలని, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాలని చర్చించారు. కూటమి ఐక్యతే బలం.. సమన్వయమే విజయానికి మార్గం అనే లక్ష్యంతో స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News