Breaking News

ఎస్సీ, ఎస్టీ, ఇన్నోవా కార్ల లబ్ధిదారులకు ఋణ మాఫీ కల్పించాలి

-ఋణం మీద 80శాతం రాయితీ కల్పించాలి
-ప్రతి 3నెలలకు కడుతున్న టాక్స్ ను రద్దు చేయాలి
-లబ్ధిదారులకు కార్ల లైఫ్ టాక్స్ జీవో ప్రకటించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ, ఎస్టీ, ఇన్నోవా కార్ల లబ్ధిదారులకు ఋణమాఫీ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ,ఎస్టీ, ఎన్.ఎస్.ఎఫ్(టి) డి సి ఇన్నోవా లబ్ధిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మామిడి అచ్చిరాజులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.ఈ మేరకు మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు 13 జిల్లాల సంఘం ప్రతినిధులు విలేఖరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లను పొందగలిగినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.కానీ టాక్స్,ఇన్సూరెన్స్ రూపంలో తాము అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామని వాపోయారు.కరోనా కారణంగా కిరాయి లు లేక, లాక్ డౌన్ వలన అప్పులుపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.తమకు ఋణమాఫీ కల్పించాలని లేదా 80శాతం రాయితీని కల్పించాలన్నారు. అలాగే ప్రతి మూడు నెలలకు కడుతున్న టాక్స్ ను రద్దు చేయాలని, కార్ల లైఫ్ కు జీవో ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఔదార్యంతో ఆటోలకు, టాక్సీలకు టాక్స్ లు ఎత్తి వేశారని, అలాగే తమకు టాక్స్ లు రద్దు చేసి, ఋణమాఫీ చేసి తమ కుటుంబాలు ఆదుకుంటారని కోరుతున్నామన్నారు.ఈ కార్లే తమకు జీవనాదారమని టాక్స్ లు కట్టలేక సతమతమవుతున్నామని, ముఖ్యమంత్రి స్పందించి మమ్మల్ని ఋణ విముక్తి చేయాలని ప్రాధేయపడ్డారు.

కార్యదర్శి ఇడదల రామచంద్రయ్య మాట్లాడుతూ ఎన్.ఎస్.ఎఫ్ డి.సి ఇన్నోవా కార్లను పొందినప్పటినుండి కోవిడ్ కారణముగా ప్రతి నెల ఋణ వాయిదాలు చెల్లించలేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కావున తమ యందు దయవుంచి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ అధికారులు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారని సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశామని తెలిపారు. సమావేశంలో ఉపాధ్యక్షులు ఎస్ శేఖర్ బాబు, పి.రంగ నాయకులు, టీ ప్రవీణ్, బి. గోపాలకృష్ణ, కోశాధికారి ధర్మారావు, జి సుందర్ సింగ్, సహాయ కోశాధికారులు, సహాయ కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు,13 జిల్లాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *