విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాకర్స్ ఇంటర్నేషనల్ హెచ్ ఆర్ టీ విజయీభవ ఆధ్వర్యంలో 30 వ సంవత్సర “వాకర్స్ అంతర్జాతీయ కన్వెన్షన్” ను ఈ నెల 18 , 19 తేదీల్లో గుంటుపల్లిలోని సిఎ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నామని ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు తొండెపు వెంకట హనుమంతరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు 30 సంవత్సర వాకర్స్ అంతర్జాతీయ కన్వెన్షన్ గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ వాకర్స్ ఇంటర్నేషనల్ అనేది ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతోనూ, జాతిపిత మహాత్మాగాంధీజీని ఆదర్శంగా తీసుకొని ప్రారంభించామని తెలియజేశారు. దాదాపు 1350 వాకర్స్ క్లబ్ లతో, 2 లక్షల మంది సభ్యులతో దేశవిదేశాల్లో ఈ సంస్థ విస్తరించి ఉందని తెలిపారు. దీని వ్యవస్థాపకులు మాజీ మంత్రి సుంకర సుదర్శన్ అని ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేసామని చెప్పారు. ఈ వాకర్స్ అంతర్జాతీయ సంస్థ 30 వ సంవత్సర అంతర్జాతీయ కన్వెన్షన్ ను 18, 19 తేదీలలో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వసంత కృష్ణ ప్రసాద్ లు పాల్గొంటారని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అనేక సాంస్కృతిక ప్రదర్శనలు, ఆరోగ్య ప్రసంగాలు, వాకర్స్ ప్రతినిధులకు నడక పోటీలు నిర్వహిస్తామని గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేస్తామని తెలిపారు. అలాగే ఉత్తమ సేవలందించిన వాకర్స్ క్లబ్ లకు అవార్డుల పురస్కారం ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. సమావేశంలో కన్వెన్షన్ చైర్మన్ డబ్ల్యూఆర్ రావి కృష్ణారావు, ఇంటర్నేషనల్ పి ఆర్ ఓ, కన్వెన్షన్ సెక్రెటరీ డబ్ల్యూఆర్ కొల్లూరి, ఇంటర్నేషనల్ సెక్రెటరీ డబ్ల్యూఆర్ ఏ. అమర్నాథ్, కన్వెన్షన్ కోఆర్డినేటర్ డబ్ల్యూఆర్ మాదినేని చక్రధర్, ఇంటర్నేషనల్ ట్రెజరర్ డబ్ల్యూఆర్ మోటూరి ప్రభాకర్, ఎన్ వెంకట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News