Breaking News

దేవతా సర్పమునకు సర్ప సూక్తము, తదితర సర్ప సంస్కారములు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
చాలా కాలం నుండి దేవాలయం ప్రాంగణముల యందు రెండు దేవత సర్పములు భక్తులకు ఎటువంటి అపకారము తలపెట్టక సంచరించుచుండెడివి. అందులో ఒక సర్పము ఈరోజు సహజముగా కాలం చెందినది. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణ అధికారి భ్రమరాంబ ఆదేశాల మేరకు కృష్ణా నది ఒడ్డున ఆలయ ముఖ్యఅర్చకులు యజ్ఞ నారాయణ శర్మ ఈ దేవతా సర్పమునకు సర్ప సూక్తము, తదితర సర్ప సంస్కారములు శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమము నందు స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద శర్మ, ఆలయ వైదిక కమిటీ సభ్యులు లింగంభొట్ల దుర్గా ప్రసాద్, ఆర్ శ్రీనివాస శాస్త్రి, వి.మహర్షి మరియు అర్చక బృందం వారు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *