ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు శనివారం ఉదయం 10.30 గం.ల నుండి 11.30 గం.ల వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ”డయల్ యువర్ ఇ.ఓ” అనే కార్యక్రమమును నిర్వహించుట జరిగినది. ఇందులో భాగంగా శనివారం విజయవాడ నాలుగు స్తంభాల సెంటర్ కు చెందిన ఒక భక్తుడు మరియు కృష్ణా జిల్లా కంకిపాడు కు చెందిన మరి ఒక భక్తుడు ఫోన్ ద్వారా వారి యొక్క సూచనలు మరియు సలహాలు తెలియజేయడం జరిగినది. అనంతరం కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ వారి సూచనలను పరిశీలించి తగు చర్య తీసుకొంటామని తెలిపారు. దేవస్థానం నందు ప్రతి నెలలో 1వ మరియు 3వ శనివారములలో ఉదయం 10.30 గం.ల నుండి 11.30 గం.ల వరకు నిర్వహించబడు ఈ కార్యక్రమములో దేవస్థానమునకు సంబందించిన సూచనలను లేదా ఫిర్యాదులను భక్తులు నేరుగా 9440764000 నెంబరుకు ఫోనుచేసి కార్యనిర్వహణాధికారి వారికి తెలియజేయవచ్చును. భక్తులు తెలిపిన సూచనలు మరియు ఫిర్యాదులను పరిశీలించి దానిపై తగిన చర్య తీసుకొనబడును.
Prajavartha Online Telugu News