Breaking News

మూత్రకోశవ్యాధుల శస్త్రచికిత్స విభాగం, క్యాన్సర్‌, ప్లాస్టిక్‌ చికిత్సలకు జిజిహెచ్‌లో ఓపి సేవలు ప్రారంభం…

-జిజిహెచ్‌లో అందుతున్న వైద్య సేవలను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌ జిఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌…

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుప్రతిలో అందుబాటులోకి తీసుకువచ్చిన మూత్రకోశవ్యాధుల శస్త్రచికిత్స, క్యాన్సర్‌, ప్లాస్టిక్‌ సర్జరి, డయాలిసిస్‌ యూనిట్‌ వైద్య సేవలను రోగులు వినియోగించుకోవాలని విజయవాడ సబ్‌ కలెక్టర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ చెప్పారు.
సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో (కొత్త జిజిహెచ్‌) నూతనంగా ఏర్పాటు చేసిన మూత్రకోశవ్యాధుల శస్త్రచికిత్స విభాగం, క్యాన్సర్‌, ప్లాస్టిక్‌ సర్జరిల ఓపి సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ జిఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్‌ సేవలు ప్రారంభించాలని స్పందన కార్యక్రమంలోకూడా ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని అవి ఈ రోజు సూపర్‌ స్పెషాలిటి బ్లాక్‌లో ప్రారంభం కావడం ఆనందంగా వుందన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు కూడా అందుబాటులోకి రావాడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అందిస్తూన్న వైద్య సేవల పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని డాక్టర్లు పెంచుతున్నారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సూపర్‌ స్పెషాలిటి బ్లాక్‌లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ అభినందించారు. కోవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలను అందించారన్నారు.
ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో కలిసి వార్డులను పరిశీలించి, ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ యూరాలజీ విభాగం విజయవాడలోని సిద్ధార్థమెడికల్‌ కాలేజికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి వరకు యూరాలజీ శస్త్ర చికిత్స విభాగం లేకపోవడంతో రోగులు తప్పనిసరి పరిస్థితులో గుంటూరు, తిరుపతి ఆసుపత్రులకు రిఫర్‌ చేయడంతో రోగులు ఇబ్బంది పడేవారని పైగా ప్రైవేటు ఆసుపత్రిలో లక్షల రూపాయలు ఖర్చు చేయవల్సివచ్చేదన్నారు. ఈ పరిస్థితిని గమనించి వైద్య ఆరోగ్య శాఖ డియంఇ వారితో మాట్లాడి యూరాలజీ విభాగాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇద్దరు యూరాలజీ స్పెషాలిటి వైద్యులను అవుట్‌సోర్సింగ్‌ పద్దతిన నియమించుకోనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అదే విధంగా నిపుణులైన వారిచే యూరాలజీ (కిడ్ని శస్త్ర చికిత్సలు ) విభాగాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఇక్కడ కిడ్నీలో రాళ్లు, వాపు, క్యాన్సర్‌, ప్రోస్టేటు మొదలగు ఆపరేషన్లు చేస్తారని అతి త్వరలో మూత్రపిండాల మార్పిడికు ప్రభుత్వ అనుమతితో చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా 12 పడకల డయాలసిస్‌ విభాగాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఇంతవరకు కీమో, రేడియోథెరపి జరగలేదని ఈ పరిస్థితుల్లో నేడు క్యాన్సర్‌ క్లినిక్‌ను కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. తొలుత ఆయా విభాగాలను విజయవాడ సబ్‌ కలెక్టర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, డియంఇ వైద్య ఆరోగ్య శాఖ డా. యం. రాఘవేంద్రరావు, ప్రిన్సిపల్‌ డా. బి.రాజ్యలక్ష్మి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిజిహెచ్‌ ఆర్‌యంఓ డా. శోభ తదితర వైద్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *