Breaking News

విజయవాడలో బ్రెయిలీ లిపి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కృషి… : ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు 

-సెంట్రల్ లో ఘ‌నంగా లూయిస్ బ్రెయిలి 213 వ జన్మదిన వేడుకలు
-అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి బ్రెయిలీ
-ఎమ్మెల్యే చేతులమీదుగా దివ్యాంగులకు రూ. లక్షా 80 వేలు విలువ చేసే పరికరాల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని సెంట్రల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు అన్నారు. బందర్ లాకుల సెంటర్ వద్ద స్వాతంత్ర సమరయోధుల భవనం నందు 213 వ లూయిస్ బ్రెయిలి జన్మదిన వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రద‌ర్శించిన‌ ఆట పాటలు అలరించాయి. వేడుకలలో సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు ముఖ్య అతిథిగా హాజ‌రై జ్యోతి ప్రజ్వల‌న చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంత‌రం లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూల మాలలు వేసి.. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ.. నేటి సమాజంలో దివ్యాంగులు అన్ని రంగాలలో సాధారణ వ్యక్తులతో సమానంగా రాణిస్తున్నారని.. అదే పట్టుదలతో జీవితాన్ని ధైర్యంగా ముందుకు సాగించాలన్నారు. కంటి చూపు లేకపోయినా లూయిస్ బ్రెయిలీ లైన్ టైపు పద్దతితో విద్యాభ్యాసం పూర్తిచేసి.. 17 ఏళ్లకే ప్రొఫెసర్ అయ్యారన్నారు. పగలు ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తూ.. రాత్రుళ్లు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీలో నిమగ్నమై విజయవంతమయ్యారన్నారు. ఆయన కృషి ఫలితంగానే నేడు ప్రపంచంలో ఎందరో దివ్యాంగులు అనేక రంగాలలో రాణిస్తున్నారన్నారు. అటువంటి మహనీయుడి గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మల్లాది విష్ణు అన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ నగరంలో బ్రెయిలీ లిపి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి  ఆంధ్రప్రదేశ్ లో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మల్లాది విష్ణు  అన్నారు. అనంతరం 10 మంది దివ్యాంగులకు బ్రెయిలి కేన్లు, ఇరువురికి ల్యాప్ టాప్ లు అందజేశారు. తదనంతరం బ్రెయిలీ క్యాలెండ‌ర్ ను ఆవిష్కరించారు, చిన్నారుల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేశారు. కార్యక్రమంలో న్యూ లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ప్రెసిడెంట్ సీతారామ స్వామి, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీంద్ర బాబు, ఆత్మకూరు సురేష్, వెన్నం రత్నారావు, ఉద్ధంటి సురేష్, వాసు, భోగాది మురళి, ఏడీ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *