-డాక్టర్ కన్సల్టేషన్ తో సహా పలు నిర్ధారణ పరీక్షలు ఉచితం
-సరైన చికిత్సతో సంతాన సాఫల్యం
-సంతానలేమికి అను మై బేబీలో అత్యాధునిక చికిత్సలు
-సాధారణ ప్రసవానికి అధిక ప్రాధాన్యత
-సేఫ్ హ్యాండ్స్ ప్రోగ్రాం ద్వారా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలకు ఉచిత చికిత్సలు
-అను హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమస్యను కచ్చితంగా గుర్తించి, సరైన చికిత్స అందించడం ద్వారా సంతానలేమి సమస్యను విజయవంతంగా పరిష్కరించవచ్చని అను హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీదేవి అన్నారు. రోటరీ ఇన్నర్ వీల్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎనికేపాడులోని అను మై బేబీ హాస్పిటల్ నందు శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో డాక్టర్ కన్సల్టేషన్ తో సహా, పాప్ స్మియర్, యుఎస్జీ అబ్డామిన్ స్కాన్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అను హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జి. శ్రీదేవి మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఖ్యాతి గడించిన ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. మహిళాభ్యున్నతి, స్త్రీ సాధికారత, సమజాభివృద్ధి కోసం ఇన్నర్ వీల్ అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని పేర్కొన్నారు. ఆధునిక జీవన విధానాల నేపథ్యంలో, నేటి సమాజంలో అనేక మంది దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారని అన్నారు. వివాహమై కొంత కాలం గడిచి, ఎటువంటి గర్భనిరోధక విధానాలను పాటించని సందర్భంలో.. సహజంగా గర్భం దాల్చని వారిని సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించాల్సివుంటుందని వివరించారు. సంతానలేమికి భార్యాభర్తల్లో ఏ ఒక్కరిలోని లోపాలైనా కారణం కావచ్చని, పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, స్త్రీలలో అండాల నాణ్యతతో పాటు సంఖ్య తక్కువగా ఉండటం సంతానలేమికి ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చని తెలిపారు. వీటితో పాటు అనేక కారణాలు సంతానలేమి సమస్యకు దారితీయవచ్చని అన్నారు. వైద్య నిపుణులను సంప్రదించి సరైన చికిత్సను తీసుకోవడం ద్వారా సంతాన సాఫల్యాత పొందవచ్చని చెప్పారు. అందుబాటులో ఉన్న ఐవీఎఫ్, ఐయుఐ విధానాల ద్వారా పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు సంతాన భాగ్యాన్ని అందించవచ్చని అన్నారు. గర్భిణులు, నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అను మై బేబీ హాస్పిటల్ నందు అత్యాధునిక సంతాన సాఫల్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శ్రీదేవి తెలియజేశారు. ఐసీఎస్ఐ, ఐవీఎఫ్, ఐయుఐ, సీమెన్ అనాలసిస్ అండ్ కల్చర్, ఎస్సీఎస్ఏ, ఒవల్యూషన్ ఇండక్షన్, ఐవీఎం సహిత ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, సోషల్ ఫ్రీజింగ్ తదితర అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు అను మై బేబీలో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. గర్భిణులు, నవజాత శిశువుల సంరక్షణకు ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన ఏకైక హాస్పిటల్ అను మై బేబీలో సాధారణ ప్రసవానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామని అన్నారు. అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల పర్యవేక్షణలో అన్ని రకాల కాన్పులకు, మరీ ముఖ్యంగా సాధారణ డెలివరీలను ప్రోత్సహించేలా విశిష్ట చికిత్సలను అందిస్తున్నామని చెప్పారు. పెయిన్ లెస్ లేబర్ హైడ్రో థెరపీ, ఫిజియోథెరపీ, మిడ్ వైవ్స్ సహాయంతో ప్రత్యేక వ్యాయామల ద్వారా నార్మల్ డెలివరీ అయ్యేలా చూస్తున్నామని అన్నారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ డెలివరీ కేసుల కోసం మల్టీ స్పెషాలిటీ ఐసీయూ సదుపాయం, గైనకాలజీ విభాగంలో హిస్టరోస్కోపీ, లాపరోస్కోపీ తదితర అడ్వాన్స్డ్ సర్జరీ సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. అను మై బేబీ ప్రత్యేకంగా చేపట్టిన సేఫ్ హ్యాండ్స్ ప్రోగ్రాం ద్వారా 30 కిలోమీటర్ల పరిధిలో సేవలందించేందుకు ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించామని ప్రకటించారు. సేఫ్ హ్యాండ్ ప్రోగ్రాంలో భాగంగా.. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలకు వెంటిలేటర్ తదితర సదుపాయాలు కలిగిన అంబులెన్స్ ద్వారా అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ మాగంటి అనురాధ, సెక్రటరీ ప్రవీణ, ట్రెజరర్ సరస్వతి, అను మై బేబీ వైద్యులు డాక్టర్ మాధురి, డాక్టర్ మంజుశ్రీ, డాక్టర్ రమ్య, డాక్టర్ కవిత, డాక్టర్ పావని పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News