విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశ పెట్టిన 2022-2023 ఆర్ధిక బడ్జెట్ గురించి ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అన్నీ ప్రభుత్వ రంగసంస్థలని పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకేనని చెప్పకనే చెప్పిందని విమర్శించారు. ముఖ్యంగా ఎయిరిండియాని అమ్మామని చెపుతూనే రక్షణ రంగంలోకి ప్రయివేటు సంస్థలని భాగస్వామ్యం చేయాలని చూడటం దేశరక్షణకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. కనీసం బి.సి., ఎస్సీ, ఎస్టీలకు అభిదృద్ధికి మొండిచెయ్యి చూపారని ఉద్యోగులకే కాక పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్లో నిరాశే మిగిలిందని, అంతేకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల్లో ముఖ్యమై ప్రత్యేక హోదా గానీ, రెవిన్యూ లోటు గానీ, విశాఖ రైల్వే జోన్ గానీ, పోలవరానికి మరియు రాజధానికి నిధుల కేటాయింపు ప్రస్తావన చేయలేదంటే మోదీ ప్రభుత్వం ఆంధ్రాకి చేసే ద్రోహం కాదా అని ప్రశ్నించారు. ప్రతిఒక్కరూ గమనిస్తున్నారని ఎప్పుడు ఎక్కడ ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు తెలుసని గుర్తుచేశారు.
Prajavartha Online Telugu News