Breaking News

డబ్బు సంపాదించడం, పన్నులు ఎగ్గొట్టడం ఎలాగో తెలిసిన మీకు ప్రజల తరపున మాట్లాడే హక్కు లేదు…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ సమస్య అయిన పెగాసస్ పై చర్చ అక్కర్లేదని, ఇది పేద ప్రజల సమస్య కాదనీ చెప్పడం విజయసాయి రెడ్డి రాజకీయ అజ్ఞానం అని, విజయసాయి రెడ్డి చేసిన వాఖ్యలపై ఏపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ వి. గురునాధం మండిపడ్డారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో డబ్బు సంపాదించడం, పన్నులు ఎగ్గొట్టడం ఎలాగో తెలిసిన మీకు ప్రజల తరపున మాట్లాడే హక్కు లేదన్నారు. మోడీ ప్రభుత్వం పెగాసస్ కొనుగోలు చేసి ఈ దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులపై, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన అనేక రాజ్యాంగ వ్యవస్థలపై బ్లాక్ మెయిలింగ్ నిఘా పెట్టి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రయత్నించడం కొరకై ఇజ్రాయిల్ గూఢచారి సాఫ్ట్ వేర్ పెగాసస్ కొనుగోలు చేశారనీ, పెగాసస్ పై న్యూయార్క్ టైమ్స్ ప్రకటించిన వార్తపై చర్చలకు, జాతీయ సమస్యల పై ముఖ్యంగా రాజ్యాంగ నిర్వాహకులైన సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జి లు, ఇతర రాజ్యాంగ హక్కుల రక్షణకై కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుంటే..ప్రాంతీయ పార్టీ నాయకుడైన విజయసాయిరెడ్డి పెగాసస్ పై చర్చ అవసరం లేదు అనీ చెప్పడం అవివేకం, రాజకీయ అజ్ఞానం అనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, మోడీకి స్వార్ధంతో కూడిన విజ్ఞాపన, విన్నపాలైన రాజకీయ ప్రయోజనాల కోసం, వాటిని సాధించడం ఎలాగో తెలియక జాతీయ సమస్య అయిన పెగాసస్ అంశం తాకట్టు పెట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. విజయసాయిరెడ్డి పెగాసస్ సామాన్య దేశ ప్రజలకు సంబంధించినది కాదని చెప్పడం ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమనీ, పేద ప్రజలు ఉపయోగించే అగ్గిపెట్టె, సబ్బు బిళ్ళా, మంచి నీళ్లు, మందు బిళ్ళలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల నుండి పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారనీ, అలా దేశ ప్రజలు చెల్లించిన పనుల్లో నుంచే పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర బిజెపి ప్రభుత్వం పెగాసస్ మరియు యుద్ధ సామాగ్రి కొనుగోలు కోసం ఇజ్రాయిల్ కు చెల్లించిందనీ, పన్నుల రూపంలో వసూలు చేసి దుర్వినియోగం చేసిన డబ్బు పేద ప్రజల కాదా? ఇది పేద ప్రజల సమస్య కాదా? అని ప్రశ్నించారు.వైసీపీ వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దొరికినప్పుడల్లా ప్రజా ప్రయోజనాలను మోడీ ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్నారనీ, ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇజ్రాయిల్ గూఢచారి సాఫ్ట్ వేర్ పెగాసస్ కొనుగోలు చేయలేదని గతంలో పార్లమెంట్ సాక్షిగా, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కేంద్ర మంత్రి ప్రకటన చేసి దేశాన్ని తప్పుదోవ పట్టించారనీ, కానీ ఈ రోజు ఇజ్రాయిల్ కంపెనీనే పెగాసస్ తో పాటు యుద్ధ సామాగ్రిని భారతదేశానికి అమ్మిన మాట నిజమేనని అంగీకరించారనీ, కానీ విజయసాయి రెడ్డి పై విషయాలను కప్పిపుచ్చే విధంగా, కేంద్ర బిజెపి ప్రభుత్వానికి లాభం చేకూర్చే ఆలోచనతో దేశ ప్రజలను, తెలుగు జాతిని అవమానిస్తున్నారని అని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *