Breaking News

మేయర్ రాయన భాగ్యలక్ష్మి ని కలిసిన A/c టెక్నీషియన్ యూనియన్…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ R & A/C టెక్నీషియన్ అసోసియేషన్ (V.A.R.T.A) 4వ వార్షికోత్సవ సందర్బముగా కమిటి సభ్యులు మంగళవారం నగర మేయర్, రాయన భాగ్యలక్ష్మి ని మర్యాద పూర్వకముగా ఆమె ఛాంబర్ నందు కలిసిన్నారు. ఈ సందర్బంగా అసోసియేషన్ కు సంబంధించి పలు విషయాలు మరియు వారి యొక్క సమస్యలను మేయర్ దృష్టికి తీసుకోని వచ్చారు. వాటిలో ప్రధానంగా A/c టెక్నీషియన్ యూనియన్ భవనము లేక పోవుట వల్ల కమిటీ కార్యకలాపాలు నిర్వహణకు సరైన సౌకర్యం లేదని వివరిస్తూ, అసోసియేషన్ భవనం నిర్మించుకొనుటకు తగిన నిర్మాణం కోసం స్థలము కేటాయించాలిని విజ్ఞప్తి చేయగా దానిపై మేయరు సానుకూలముగా స్పందించారు. భవిష్యత్తులో టెక్నీషియన్ సోదరులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కొరకు అన్ని విధాలుగా వై.ఎస్. ఆర్.సి. పి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో అసోసియేషన్ అధ్యక్ష్యులు అబ్దుల్ జమీల్ ఖాదిరి, కార్యదర్శి కె.దివాకర్, కోశాధికారి సలాం ఖాన్ మరియు కమిట్టీ సభ్యులు జయ కృష్ణ, రవి, గణేష్, కరీం, గాలిబ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *