

-హస్త కళలును ఆదరించాలి : వాసిరెడ్డి పద్మ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యస్.వి.ఆర్ ఈవేంట్స్ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ బజర్ 2022ను రాష్ట్ర మహిళా ఛైర్ పర్సన్ వాసి రెడ్డి ప్రారంభించారు.శుక్రవారం బిషప్ హజరయ్య గ్రౌండ్ నందు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా ఛైర్మన్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశీయ ఉత్పత్తులను అందరు ఆదరించాలని కోరారు.దేశియ ఉత్పత్తుల వలన మహిళలకు ఆర్థిక స్వాలంబన సాధించడానికి అవకాశం ఉందన్నారు.హస్త చేనేత వృత్తి కాళాకారులను ప్రోత్సహించాలని కొరారు.ఆనంతరం నిర్వహకులు గరిమెళ్ళ జానకి రామయ్య మాట్లాడుతూ ఈ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్ర, చేతి వృత్తుల ఆకృతులు ఏపికోప్పాక బోమ్మలు,కొండపల్లి బోమ్మలు,బెంగాలి శారీస్,కళాంకారి శారీస్ ,జైపూర్ బెడ్ షీట్స్,ఖాది వస్త్రాలు,లెదర్ బ్యాగ్స్,జ్యూట్ బ్యాగ్స్,కలంకారి టాప్స్,కిచన్ వేర్ ఐటమ్స్,టవల్స్,లుంగీలు,టెర్రకోట 0బోమ్మలు,మొదలైనవి 150 స్టాల్స్ లో వివిధ రకాలైన హస్తా కళా ఉత్పత్తులు లభిస్తాయన్నారు.ఈప్రదర్శన నెల రోజుల పాటు ఉదయం 11 గంటల నుండి రాత్రి 9.30 వరకు సాగుతుందన్నారు.ఈ ఆవకాశాన్ని విజయవాడ వాసులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి 23 వ డివిజన్ కార్పోరేటర్ నెలిబండ్ల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News