-కార్మిక పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తమ్మిన పోతరాజు ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీనివాస్ మహల్ సెంటర్ వద్దనున్న తమ్మిన పోతరాజు విగ్రహాన్ని రోడ్ వైండింగ్ లో తొలగించ రాదని విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో విగ్రహానికి జనసేన నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు స్టాలిన్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పేరుతో తమ్మిన పోతరాజు విగ్రహాన్ని తొలగించే కార్యక్రమం చేపడితే ఉపేక్షించేది లేదని, పోతరాజు కార్మిక పక్షపాతని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతని , తమ్మిన వారని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని,అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని రోడ్డు నిర్మాణ భాగంలో అధికార పార్టీ వారు తొలగించాలనుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు అనంతరం మహేష్ మాట్లాడుతూ గతంలో అభివృద్ధి పేరుతో ప్రకాశం బ్యారేజ్ వద్ద తొలగించిన పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం వాగు సెంటర్ లో మహాత్మా గాంధీ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహ పున ప్రతిష్ట నేటి వరకు జరగలేదని, అదేవిధంగా దేవతామూర్తుల విగ్రహాలను కూడా తొలగించారని ఇంతవరకూ పునఃప్రతిష్ట చేయలేకపోయినా అంశాలను పాతబస్తీ ప్రజలు మర్చిపోలేదని ఇప్పుడు తమ్మిన పోతురాజు విగ్రహాన్ని తొలగి స్తానంటే ఉపేక్షించబోమని అన్నారు ఈ క్రమంలో జనసేన నాయకులు మైలవరపు కొండలరావు, పాలడి మోహన్ రావు, విజయవాడ నగర కమిటీ సభ్యులు వేవినేని నాగరాజు, మోబీనా ,కొర్ర గంజి వెంకటరమణ, శనివారపు శివ, మరియు డివిజన్ అధ్యక్షులు పొట్నూరు శ్రీనివాస రావు, బొమ్ము రాంబాబు, నల్లబిల్లి కనకారావు, శిగినంశెట్టి రాము, అమ్మవారిధార్మిక మండలి సభ్యులు కూర్మా రావు, పోలిశెట్టి శివ, కాపు వడ్డే, రామానాయుడు, రామీ శెట్టి మురళి తరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News