Breaking News

సంక్షేమ పథకాలే రాష్ట్రంలోని మహిళలకు శ్రీరామ రక్ష… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ద్వారా ఆదాయాన్ని పెంచే కార్యకలాపాల కోసం మహిళల సమూహాలను సృష్టించడం కొరకు డ్వా క్రా పథకం ఉద్దేశించబడిందని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలే రాష్ట్రంలోని మహిళలకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
సోమవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
తొలుత మచిలీపట్నం మండల పరిధిలోని భోగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీ భ్రమరాంభిక సంఘానికి చెందిన నాగలక్ష్మి అనే మహిళ మంత్రిని కలిసి సమస్య చెప్పుకొంది. తమ సంఘ సభ్యులు 11 మంది సభ్యులలో 8 మంది తమకు రుణం వద్దని తప్పుకొంటున్నారని మిగిలిన ముగ్గురికి లోన్ ఇప్పించాలని కొందరు పురుషులు జోక్యం చేసుకొని తానూ కొత్తవారిక రుణం ఇప్పిస్తున్నట్లు లేనిపోని ప్రచారం చేస్తూ తమపై వత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, ఎం పి డీ ఓ గారిని కలిసి ఈ సమస్యను సామరస్యంగా వివాదాలు లేకుండా పరిష్కరించు కోవాలని సూచించారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలకు మేలు జరిగే విధంగా రూపకల్పన చేశారని తెలిపారు. మహిళలు బాగుంటేనే వారి ఇల్లు బాగుంటుందని, తద్వారా సమాజం, రాష్ట్రం సైతం బాగుంటుందని నమ్మి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలను నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని చెప్పారు. జగనన్న పరిపాలనలో అమ్మ ఒడి నుంచి ఆసరా, చేయూత వరకు పలు సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో మహిళ లక్షల్లో లబ్ధి పొందుతున్నారని చెప్పారు. కరోనా కష్టకాలం లోనూ, మహిళలు బాధల్లో ఉన్నప్పుడు, సొంత కుటుంబ సభ్యులే అండగా లేనప్పుడు ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలే వారికి భరోసాగా నిలుస్తున్నాయిని జగనన్న అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే మహిళలకు శ్రీరామ రక్షగా నిలిచాయిని అన్నారు. .
జగనన్న పరిపాలనలో ప్రతి పథకంలో మహిళలకు పెద్ద పీట వేశారని అగ్రతాంబూలం మహిళలకే దక్కిందని మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఆయా సంక్షేమ పథకాల వల్ల దాదాపు రూ. 57 వేల కోట్లు మహిళల అకౌంట్లలో నేరుగా జమ అయ్యాయిని పరోక్షంగా మరో రూ. 31 వేల కోట్లు లబ్ధి జరిగిందన్నారు. అంటే మొత్తం 88 వేల కోట్ల రూపాయలు కేవలం రెండేళ్ళ కాలంలోనే మహిళలకు లబ్ధి జరిగిందని మంత్రి పేర్ని నాని వివరించారు. .
అనంతరం దేవరకొండ వెంకట సంతోషి అనే మహిళ మంత్రిని కలిసి తన కుమారుడు రోహిత్ 7 వ తరగతి చదువు తున్నడని, కరోనా ఓమిక్రాన్ భయంతో బాబును పాఠశాలకు పంపించడం లేదని, రానున్న అమ్మఒడి నగదు తన ఖాతాలో జమ అయ్యేలా సహాయం చేయాలనీ కోరింది. ఈ విషయమై స్పందించిన మంత్రి ఆమెతో మాట్లాడుతూ, బడి ఈడు పిల్లలకు విద్య పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు, వారిని స్కూల్ కు క్రమం తప్పకుండా పంపించే విధంగా తల్లితండ్రులను ప్రోత్సాహించేందుకు అమ్మఒడి పథకం రూపందించిందని పిల్లలు పెద్దలు ఇంట్లో ఉంటే కరోనా రాదనీ మీరు చెప్పగలరా ? అని అడిగి హాజరు శాతం బట్టే అమ్మఒడి అర్హత కల్గుతుందని, పిల్లల విద్యా ప్రమాణాలు మెరుగుపడి వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆ మహిళకు మంత్రి సున్నితంగా చెప్పారు.
మచిలీపట్నం మండలం గుండుపాలెం గ్రామంలో కాలువ వంతెన అంచున దుస్తులు ఉతుక్కొనే విధంగా మెట్ల నిర్మాణం జరపాలని గుండుపాలెంవాసులు ఏడుకొండలు, దేవేంద్రుడు, రాఘవమ్మ తదితరులు మంత్రిని అభ్యర్ధించారు.
స్థానిక 4 వ వార్డుకు చెందిన కోతాడ రంగమ్మ అనే వృద్ధురాలు మంత్రికి తన సమస్యను తెలిపింది. చేదోడు వడ్డీ లేని రుణం 10 వేల రూపాయలు తీసుకున్నానని, అన్ని పథకాల మాదిరిగానే ఇది సైతం ఉచితం అని భావించానని అయితే , ఇప్పుడు ఆ మొత్తాన్ని చెల్లించమని అధికారులు అంటున్నారని, ఇకపై నెల నెల వేయి రూపాయలు కిస్తీ కడతానని అంటున్నా బ్యాంక్ అధికారులు ఏమాత్రం ఒప్పుకోవడం లేదని మొత్తం డబ్బు చెల్లించమంటున్నారని మంత్రికి చెప్పింది.
స్థానిక ఇంగ్లీష్ పాలెంకు చెందిన రంగాన దామోదర్ అని తాను డిప్లొమా చదివేనని ఏదైనా ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని మంత్రిని అభ్యర్ధించారు. తన కార్యాలయంలో వ్యక్తిగత కార్యదర్శి రఘురామ్ కు మీ బయో డేటా , ఫోన్ నెంబర్, విద్యార్హతల జెరాక్స్ పత్రాలు అందచేయాలని ఏదైనా అవకాశం వచ్చినపుడు మీకు తప్పక తెలియచేస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *