Breaking News

ఆర్టీసీకి ‘మహా’ ఆదాయం…

-మహాశివరాత్రికి రికార్డ్ స్థాయి ఆదాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
1.3.2022 తేదీన మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలన్నిటికీ, భక్త జన సందోహానికి అందుబాటులో నిరాటకంగా బస్సుల నిర్వహణను 02.03.2022 వరకు జరిపింది. ఈ సందర్భంగా 2.3.2022 వ తేదీన అత్యధిక ఆదాయ రికార్డును నమోదు చేసింది. 81% ఆక్యు పెన్సీ రేషియోతో మునుపెన్నడూ లేని విధంగా రూ.16.59 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, ఆర్టీసీ సేవల పట్ల ప్రయాణికుల ఆదరణ ఇంకా ఇంకా పెరుగుతున్నదని నిరూపించింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు, ప్రజలకు, ఆర్టీసీ ఎం.డి. శ్రీ సి.హెచ్. ద్వారకాతిరుమలరావు, ఐ.పి.ఎస్. కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ ఆదాయ వివరాల నమోదుని గమనిస్తే ఆర్టీసీకి మరలా పూర్వ వైభవం వస్తున్నట్లుగా అనిపిస్తోంది.
గత 2 సంవత్సరాలుగా ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి తీవ్రంగా పట్టిపీడిస్తున్న కారణంగా ఆర్టీసీ తన రోజువారీ ఆదాయాన్ని గణనీయంగా కోల్పోయింది. తదనంతరం కరోనా తీవ్రత తగ్గినందున క్రమేపి బస్సుల నిర్వహణను మెరుగు పరుచుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేందుకు సాయశక్తులా కృషి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో (ఓ.ఆర్)ను స్థిరీకరణ చేసే విధంగా ప్రయత్నాలు చేసింది. అందులో సఫలీకృతం కాగలిగింది.
ప్రయాణికుల అవసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ రద్దీ వేళల్లో అదనపు బస్సులు ఏర్పాటు చేయడం, వారి అసౌకర్యాల పట్ల శ్రద్ధ వహించి పరిష్కార దిశగా తగిన చర్యలు తీసుకోవడం, బస్సుల సమయపాలనలో ఖచ్చితత్వం పాటించడం, పల్లె ప్రజల అభీష్టం మేరకు మారుమూల ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యం కల్పించడం వంటి ప్రజా ఆమోద యోగ్య అంశాలు ఆర్టీసీకి బాగా కలిసొచ్చాయి.

కాగా, గత కొద్ది నెలలుగా డీజిల్ ధరలు పెరిగినప్పటికీ ప్రయాణీకుల సౌలబ్యతను దృష్టిలో ఉంచుకుని టికెట్ల రేట్లు ఆర్టీసీ పెంచకపోవడం కూడా ప్రయాణికులు ఆర్టీసీని ఆదరిస్తున్నారనే చెప్పవచ్చు.

సాధారణ రోజులలో రోజువారీ ఆర్టీసీ సగటు ఆదాయం రూ.12.50 కోట్లుగా ఉంటుంది. పండుగలు, పర్వదినాలలో ఈ ఆదాయం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
కాగా 02.03.2022 తేదీనాటి ఆదాయ వివరాలను పరిశీలిస్తే కర్నూలు రీజియన్ రూ.2.32 కోట్లు, గుంటూరు రీజియన్ రూ. 2.08 కోట్లు, చిత్తూరు రూ. 1.99 కోట్ల రూపాయలతో ముందంజలో ఉన్నాయి.మొత్తంగా 12 రీజియన్ల ఆదాయ మొత్తాలను కలుపుకుంటే తేది. 2.3.2022 న రూ. 16.59 కోట్లు వసూళ్లతో రికార్డు సృష్టించింది.
గత సంవత్సర కాలంగా రోజువారీ అత్యధిక ఆదాయ నమోదు వివరాలను పరిశీలిస్తే 18.1.2021 (సంక్రాంతి ) తేదీన రూ.17.78 కోట్లు, 18.10.2021 (దసరా) తేదీన 17.౦5 కోట్లు, కాగా గత ఏడాది ఇదే మహా శివరాత్రి బస్సుల నిర్వహణ ద్వారా రూ.14.74.కోట్లు సాధించగా, ఈ 2.3.2022 తేదీన 16.59 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్టీసీ సాధించింది. ఇది ప్రయాణికుల పట్ల సిబ్బంది సేవా దృక్పధం, విధుల పట్ల వారి అంకిత భావాన్ని తెలియజేస్తుంది.
ఇదే స్పూర్తితో మున్ముందు ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంస్థ ఎం.డి. శ్రీ సి.హెచ్. ద్వారకాతిరుమల రావు, ఐ.పి.ఎస్. తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది సేవలను అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *