
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
వర్క్స్ బోర్డు ను వ్యాపారపరం చేసేలా నిర్ణయాలు ఉన్నాయని అహలే సున్నత్ జమాత్ రాష్ట్ర కో-కన్వీనర్ అల్తాఫ్ బాబా అన్నారు. శుక్రవారం కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షా బుఖారి దర్గా ఆస్థానంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవి చేపట్టిన వెంటనే ఒక బోర్డ్ చైర్మన్ అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టకపోగా, ఇప్పటికీ దర్గాల ఆధీనంలో ఉన్న మిగిలిన ఆస్తులు కూడా లీజులు పేరిట అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం అత్యంత దారుణమన్నారు. అహ్లే సున్నత్ వల్ జమాత్ చెప్పినట్టుగానే వక్ఫ్ బోర్డు ఆస్తులు లీజులు పేరిట బడా కంపెనీలకు ధారాదత్తం చేయడం బాధాకరమన్నారు. ముస్లింల పేరు చెప్పుకుని వక్ఫ్ భూముల్లో వ్యాపారాలు చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే మొదట ఆక్రమణలకు గురైన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. రూ.100 కోట్ల ఆదాయం పేరిట మభ్యపెట్టి మిగిలి ఉన్న భూములు కూడా లీజులు పేరిట విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్న కేసులు క్లియర్ చేయించాలని, సరైన న్యాయవాదులను నియమించి పోరాటం చేయాలన్నారు. మేము కూడా దర్గాలకు వెళ్లే వారమని చెప్పుకునే వారు ఆది, సోమవారాలు కంటే ముందు ఎప్పుడైనా దర్గాలకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయా? అని సూటిగా ప్రశ్నించారు. ఎవరిని మోసం చేయడానికి ఈ విధంగా చేస్తున్నారో వాళ్లే ప్రశ్నించుకోవాలన్నారు. ముమ్మాటికీ వక్ఫ్ బోర్డ్ సున్నీ జమాత్ సంబంధించింది కాబట్టి ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఇస్లాం పుట్టిన సౌదీ అరబ్‌లో నిషేధించిన సంస్థల గురించి మాట్లాడితే పెయిడ్ ఆర్టిస్టులతో నీచమైన ఆరోపణలు చేయించటం బాధాకరమన్నారు. భూములు, ఆదాయం, వ్యయంపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News