Breaking News

స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి…

-రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
-గతంతో పోలిస్తే మంత్రి  హయంలో అనేక అభివృద్ధి పనులు…
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 37వ డివిజన్ నందు రూ.428.73 లక్షల 14వ ఆర్ధిక సంఘ నిధులు మరియు మున్సిపల్ సాధారణ నిధులతో అభివృద్ధి పరచిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి మరియు స్థానిక కార్పొరేటర్  మండేపూడి చటర్జీ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాదాయ, ధర్మాదాయ మాత్యులు  వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని డివిజన్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టుయే కాకుండా వాటిని ప్రారంభించుట కూడా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ డివిజన్ నందు సి.సి. రోడ్లు, 1200 యం.యం. డయా ఆర్.సి.సి వర్షపు నీటి మళ్లింపు పైపు లైన్ ఏర్పాటు, గాంధీజీ 1136 కె.యల్.ఇ.ఎల్.ఎస్.ఆర్ మరమ్మత్తులు మరియు పుట్ పాత్ నిర్మాణాలు మా ప్రభుత్వంలో చేపట్టి పూర్తి చేయుడం జరిగిందని అన్నారు. అన్ని డివిజన్ల అభివృద్ధియే లక్ష్యంగా వై.సి.పి ప్రభుత్వం, నగరపాలక సంస్థ పని చేస్తూందని పేర్కొన్నారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చొరవతో పశ్చిమ నియోజకవర్గం అన్ని డివిజన్లు అభివృద్ధి చెందుతున్నాయని, డివిజన్ లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టి వాటిని పూర్తి చేయుట జరుగుతుందని అన్నారు. గతంతో పోలిస్తే మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు హయంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు, ఈ ఘనత కేవలం వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం మా మంత్రి గారిదే అని పేర్కొన్నారు. ప్రతిరోజు సమీక్షిస్తూ స్థానిక కార్పొరేటర్ సూచనలకు అనుగుణంగా ప్రజల అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, డివిజన్లను అభివృద్ధి పరచుట జరుగుతుందని అన్నారు. అనంతరం డివిజన్ పరిధిలోని గాంధీజి ఇండోర్ స్టేడియం, పలు వీధులలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలు చేపట్టవలసిన చర్యలపై అధికారులతో కలసి చర్చించి పలు సూచనలు చేసారు. కార్యక్రమములో కార్పొరేటర్ మహదేవు అప్పాజీ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణమూర్తి, ఇతర అధికారులు సిబ్బంది మరియు స్థానికులు, వై.సి.పి శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *