విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నాడు -నేడు కార్యక్రమం ద్వారా చేపడుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి పనులు పూర్తి నాణ్యతతో నిర్మించాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జేసీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లాలో నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణ పనులపై వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల కల్పన విభాగం మరియు వైద్యాధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ శివశంకర్ మాట్లాడుతూ జిల్లాలో నాబార్డ్ గ్రాంట్ కింద రూ.70. 26 కోట్ల రూపాయలతో 12 ప్రభుత్వ ఆసుపత్రి భవనాలను నిర్మిస్తున్నామన్నారు. గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, గూడూరు, అవనిగడ్డ, చల్లపల్లి, మైలవరం, నందిగామ, ఉయ్యురు, కంకిపాడు, తిరువూరు, విస్సన్నపేట లలోని ప్రభుత్వ ఆసుపత్రి భవనాల నిర్మాణం, అదనపు భవనాల నిర్మాణం వంటి నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. భవన నిర్మాణ పనులు వేగవంతం చేయడంతో పాటు నిర్దేశించిన సమయంలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనులు పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. నిర్మాణ పనుల ప్రగతి ప్రతీ వారం సమీక్షించడం జరుగుతుందన్నారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు.
సమావేశంలో జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డా. జ్యోతిర్మణి , ఏ పి ఎం ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. రవీంద్రబాబు, ఏ పి ఎం ఐ డి సి ఇంజినీర్లు, ఎం.ఈ .ఐ.ఎల్. సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News