అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు అజరామరం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దేశంలో బాటలు వేసిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు అని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను సత్యనారాయణపురంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అమరజీవి త్యాగానికి గుర్తుగా నెల్లూరు జిల్లాకు అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లా అని నామకరణం చేశారన్నారు. కానీ గత ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో పొట్టి శ్రీరాములు సేవలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా విస్మరించారన్నారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పొట్టి శ్రీరాములు త్యాగాలను తెలుగు ప్రజలంతా గుర్తు పెట్టుకునే విధంగా ఆయన జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారన్నారు. ఆ మహనీయుని ఆశయాల సాధనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు శర్వాణీ మూర్తి, బాలి గోవింద్, కొంగితల లక్ష్మీపతి, వైఎస్సార్ సీపీ డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, నాయకులు కొనకళ్ల విద్యాధరరావు, పి.మురళీకృష్ణ, కొల్లూరు రామకృష్ణ, ఆత్మకూరు సుబ్బారావు, నాడార్స్ శ్రీను, మైలవరపు రాము, శనగవరపు శ్రీనివాస్, కె.ఫణి తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *