కార్యదీక్ష లక్ష్యసాధనలో అగ్రస్థానం పొట్టి శ్రీరాములుదే… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-అమరజీవి త్యాగం మనందరికీ స్ఫూర్తి
-ఎమ్మెల్యే చేతుల మీదుగా అమరజీవి విగ్రహావిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని గుజ్జల సరళ దేవి కళ్యాణ మండపం ఆవరణలో జరిగిన అమరజీవి జయంతి వేడుకలలో స్థానిక కార్పొరేటర్ ఎండీ షాహినా సుల్తానాతో కలిసి పాల్గొని ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మరమ్మతులు నిర్వహించిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆయన పున: ప్రారంభించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రేమ, సేవ, నిస్వార్ధతలు మూర్తీభవించిన వ్యక్తి పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు. అనుకున్నది సాధించాలనే పట్టుదల, కార్యదీక్ష, నిబద్దత, క్రమశిక్షణలో పొట్టి శ్రీరాములుదే అగ్రస్థానమని అన్నారు. ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ గాంధీ మహాత్ముడి సిద్ధాంతాలకు ప్రభావితుడై సబర్మతీ ఆశ్రమానికి వెళ్ళి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించారని చెప్పారు. అమరజీవి చేసిన ప్రాణ త్యాగఫలితంగానే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఆ మహనీయుని త్యాగాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆయన స్ఫూర్తితో మంచి సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, నాయకులు హఫీజుల్లా, ఆత్మకూరు సుబ్బారావు, పి.మురళీకృష్ణ, కొనకళ్ల విద్యాధరరావు, నాడార్స్ శ్రీను, వెన్నం రత్నారావు, కనమర్లపూడి సుబ్బారావు, పైడిమర్రి రామారావు, గార్లపాటి సుదర్శన్, చింతా శ్రీనివాసరావు, గల్లెపోగు రాజు, భూమా రమేష్, ఎన్. సురేష్, నాగుల్ మీరా, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *