Breaking News

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం :దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్న దృష్ట్యా పాదచారులకు ఇబ్బందులు లేకుండా చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం విజయవాడ పటమాటలంక డీ మార్ట్ వద్ద తూర్పు నియోజకవర్గ ఆటో యూనియన్ అధ్యక్షులు శెట్టికం దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో దేవినేని నెహ్రూ ఆటో స్టాండ్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రం ను అవినాష్ ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి పేరు మీద ఆయన అభిమానులు ఇలా సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చింతల సాంబయ్య, వైస్సార్సీపీ నాయకులు కొరివి చైతన్య,వరదా శంకర్, రాయపురెడ్డి పండు, పలిశెట్టి గాంధీ, ఆళ్ల నాగరాజు మరియు ఆటోయూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *