Breaking News

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆలయాలను సందర్శించిన తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని పటమాట,గుణదాల,కృష్ణలంక ప్రాంతలలోని ప్రముఖ దేవాలయాలు,మరియు భక్తులు ఏర్పాటు చేసిన పందిరి లలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ వేడుకలలో స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ స్వామి వారి ఆశీస్సులు అందుకోవడం జరిగింది అని తెలిపారు. ఆ స్వామి దయతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకొన్నాను అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం,కొరివి చైతన్య వర కార్పొరేటర్లు ప్రవల్లిక, సాంబయ్య, అమర్నాద్, రామిరెడ్డి,వైస్సార్సీపీ నాయకులు మాగంటి నవీన్,గల్లా పద్మావతి,ఇజ్జాడ తేజ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *