Breaking News

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సత్యనారాయణపురం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్. ఎన్. పురం పార్క్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గత తొమిదేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి వేసవిలోనూ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న వాకర్స్ అసోసియేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. వేసవి కాలంలో చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీర్చడానికి దోహదపడతాయన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చే వాకర్స్, విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పాదచారులు, నగర ప్రజలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ప్రధాన కూడళ్ల వద్ద, రద్దీ ప్రాంతాలలో చలి వేంద్రాలను ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా పానకం, వడపప్పు, మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, వర్తక సంఘం నాయకులు మైలవరపు రాము, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్తూరు తుకారాం బాబు, సభ్యులు వరప్రసాద్, వెంకట భాగ్యరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *