Breaking News

కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సాయం

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం రూరల్ మండలం, పూలకుంటకు చెందిన కౌలు రైతు మాలింతం చిన్నగంగయ్య కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్  పరామర్శించారు. అతని భార్య  అరుణమ్మకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా చిన్నగంగయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పేరు పేరునా పలుకరించి ఓదార్చారు. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేకపోయినా కష్టాల్లో ఉన్న రైతుల కుటుంబాలకు మా వంతు అండగా నిలబడాలన్న లక్ష్యంతో రైతు భరోసా యాత్ర చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు  టి.సి. వరుణ్, పార్టీ రాయలసీమ నేత  రాందాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *