విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు, ఒకరికొకరు అలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. గాంధీనగర్ లోని జింఖానా గ్రౌండ్స్ నందు ఖూబా ఈద్గాహ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్ధనలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ముస్లింల జీవితంలో రంజాన్ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కరుణ, సేవాతత్పరత, సుహృద్భావానికి రంజాన్ పండుగ ప్రతీక అని తెలిపారు. ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందన్నారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని.. వారి సంక్షేమానికి ప్రతి ఏటా భారీగా నిధులు కేటాయించి, ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఖూబా ఈద్గాహ్ కమిటీ అధ్యక్షులు మహ్మద్ ఆదిల్, సభ్యులు ఎండి. ఉస్మాన్, ఎండి. యూసఫ్, అలీ అన్సారీ, అబ్దుల్ నజీర్, ముస్లిం సోదరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News