Breaking News

నేటి సమాజ శ్రేయస్సు కోసం రెండు పుస్తకాలవిష్కరణ…


-హిందూ మత దివ్యత్వం భగవద్గీత… : గరికపాటి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ శ్రేయస్సు కోసం తాను రచించిన రెండు పుస్తకాలను ఈ నెల 7న విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఆవిష్కరిస్తున్నట్లు ఎన్ఆర్ఐ డాక్టర్ ఆనంద్ గరికపాటి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు గీతా రిసెర్చర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గరికెపాటి ఆనంద్ మాట్లాడుతూ విజయవాడ సత్యనారాయణపురం వాసి అయినా డాక్టర్ గరికెపాటి ఆనంద్ గత 50 సంవత్సరాలుగా యు ఎస్ ఏ లోని ఫ్లోరిడాలో ఉంటున్నానని, యుఎస్ఎలో ఒక యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేసి రిటైర్మెంట్ అయ్యాయని, అనంతరం సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేసి కొంతకాలానికి  అక్కడే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ని నెలకొల్పానన్నారు. సమాజ శ్రేయస్సు కోసం తాను రెండు విషయాలలో ఎక్కువుగా మక్కువ పెంచుకుని హిందూ మత దివ్యత్వం భగవద్గీత, భారత రాజ్యాంగం క్లిష్టమైన లోపాలు మరియు అవినీతికి మూలం అనే అంశాలపై  మరో రచయిత సుప్రీం కోర్ట్ లాయర్ అభిషేక్ కృష్ణ గుప్త తో కలిసి రెండు పుస్తకాలను రచించినట్లు తెలియజేశారు. వాటిలో ఒకటి భారత రాజ్యాంగం క్లిష్టమైన లోపాలు, వాటికి అవినీతికి మూలాలు ఎలా అవుతున్నాయో తెలుసుకుని ఈ పుస్తకం ద్వారా వివరించానని, అలాగే రెండవ పుస్తకం భగవద్గీత గురించి తెలుసుకుని వ్రాసామని తెలిపారు. ఈ రెండు పుస్తకాలు మానవ సమాజానికి ఎంతో శ్రేయస్కరమని వివరించారు. గీతా రీసెర్చర్ నిర్వాహకులు, ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ పొక్కులూరు సుబ్బారావు మాట్లాడుతూ సమాజంలో అవినీతిని ప్రాలదోలడానికి సమసమాజ స్థాపన కై రచయితలు రచించిన రెండు పుస్తకాలను ప్రజలకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. హై కోర్ట్ అడ్వకేట్ లోక్ సత్తా సిటీ ప్రెసిడెంట్ బి.అశోక్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మన జీవనం చాలా తక్కువగా ఉందని అన్నారు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు  దాటిన పూర్తిగా అభివృద్ధి చెంద లేకపోయామన్నారు. మన హక్కులు మనం పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని దీనికి కారణం రాజ్యాంగం మీద సరైన అవగాహన లేకపోవడమే అని చెప్పారు. మనిషి బ్రతికి ఉండంగా ఉపయోగపడే ఏకైక గ్రంథం రాజ్యాంగం అని  అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని అప్పుడే మన హక్కులు మనం పూర్తిగా అనుభవించగలం అని తప్పులు ప్రశ్నించే తత్వం అలవడుతుందని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *