విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్, రాణిగారితోట లో నందు స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 20లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపట్టబోయే సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ మరమ్మతులు పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి లతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పనులు అన్ని వేగవంతం గా జరిగేలా నిత్యం పర్యవేక్షణ చేయలని వైసీపీ నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్పొరేటర్ గా ఉన్న సమయంలో దాదాపు 20లక్షల రూపాయల బడ్జెట్ తో అన్ని కార్యక్రమాలు ముగించుకొని భూమి పూజ చేసిన తరువాత తెలుగుదేశం పార్టీ పెద్దల అండతో స్వయంగా లీజుదారుడే అభివృద్ధి కి అడ్డంగా నిలిచారు అన్నారు. మరలా ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రత్యేక కృషితో సుదీర్ఘ కాలం తరువాత పేదలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అన్నారు.గత టీడీపీ ప్రభుత్వం లో ఈ డివిజన్ లో వైసీపీ కార్పొరేటర్ గెలిచారని ఇక్కడి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా,అభివృద్ధి కి సహకరించకుండా నానారకాలుగా ఇబ్బందులు పెట్టారని,కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వందల కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు చెప్పట్టడామే కాకుండా, ఇంటిఇంటికి మంచినీరు సరఫర చేసేలా మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం గా పూర్తి చేసి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఒక పక్క వేగవంతం గా అభివృద్ధి పనులు చేయడంతో పాటు మరోపక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు గాని,ఇళ్ల పట్టాల అందజేయడం జరుగుతుంది అంటే అది వైసీపీ ప్రభుత్వ ఘనతనే అని అన్నారు.రిటైనింగ్ వాల్ నిర్మాణం వలన ఆవాసం కోల్పోయిన వారికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు కలిగిన ఇళ్లను ఉచితంగా కేటాయించాము అని పేద ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది అనేదానికి ఇదే నిదర్శనం అన్నారు.అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని,ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు మా పార్టీ వైపే ఉంటారని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మార్కెట్ యాదృ డైరక్టర్ బాలరాజు,నాగవంశ డైరక్టర్ సుజాత, వైసిపి నాయకులు, కావటి దామోదర్,తాజుద్దీన్,చింతా బుచ్చిబాబు, మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News