Breaking News

ప్రభుత్వం మీద అక్కసుతోనే ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ ను తట్టుకోలేక అక్కసుతో నే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలలో అపోహలు సృష్టిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. శుక్రవారం గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 20 డివిజన్, పాత పోస్ట్ ఆఫీస్ రోడ్ మరియు హై స్కూల్ రోడ్ నందు స్థానిక కార్పొరేటర్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు తో కలిసి ఇంటి ఇంటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం,అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు వస్తుంటే ప్రజలు ఎదురొచ్చి మరి స్వాగతం పలుకుతున్నారని ప్రభుత్వ పాలన మీద ప్రజలు ఎంత సంతృప్తి గా ఉన్నారో అర్థం అవుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం లో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసారని,ఏదైనా పేదవారికి పధకం అందలి అంటే కార్యాలయల చుట్టూ కల్లారిగేలా తిరిగి లంచాలు ఇస్తే తప్ప అవ్వని పరిస్థితి అని కానీ నేడు వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పథకాలు అందుతున్నాయని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా జన్మభూమి కమిటీలలో వారు చెప్పిన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు వచ్చేవి, కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కులాలకు,మతాలకు,ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా జన్మభూమి కమిటీలలో వారు చెప్పిన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు వచ్చేవి, కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంలో కులాలకు,మతాలకు,ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పధకాలు అందజేస్తుంటే ఇక్కడి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజలలో భయాందోళనలు కలిగించే విధంగా పధకాలు రద్దు చేస్తున్నారని అబద్ధపు మాటలు చెబుతూ షో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.కేవలం తమ రాజకీయ మనుగడ కోసమే టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుంది అని ప్రజలెవరు వాటిని నమ్మవద్దని హితవు పలికారు. కృష్ణలంక ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు, మంచినీటి పైప్ లైన్,ఇతర మౌలిక సదుపాయాల కల్పన చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల మద్దతు తో జగన్ గారి నాయకత్వం లో మరోసారి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మీర్ హుస్సేన్,వైస్సార్సీపీ నాయకులు షేక్ సుబాని, మాజీ కార్పొరేటర్ పల్లెం రవి,గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరక్టర్ విజయలక్ష్మి,వైస్సార్సీపీ నాయకులు మల్లి,పప్పుల వెంకట్,రఫీ,శాస్త్రి,స్టాండింగ్ కమిటీ మెంబెర్ తంగిరాల రామిరెడ్డి,22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి. 21వ డివిజన్ వైసిపి నాయకులు పుప్పాల రాజా మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *