విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాటం చేయటమే అల్లూరి సీతారామరాజుకు నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 98వ వర్థంతి సందర్భంగా శనివారం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, సంక్షేమంపై బ్రిటిష్ ప్రభుత్వం పై పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. నేటి యువత ఆయన త్యాగాలను గుర్తుంచుకోవాలన్నారు. సమాజంలో ఎందరో వ్యక్తులు పుడతారని, వారిలో కొందరినే మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవడం జరుగుతుందన్నారు. అటువంటి వారిలో అల్లూరి సీతారామరాజు ఆకోవకు చెందుతారని కలెక్టర్ అన్నారు.
Prajavartha Online Telugu News