Breaking News

గడప గడపకు సంక్షేమ పాలన.. జగనన్నతోనే సాధ్యం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి మన తూర్పు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు స్థానిక కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి ఆధ్వర్యంలో 7వ డివిజన్ ప్రాంతంలో 39 సచివాలయం పరిధిలోని C2,C3 మరియు C4 వలంటీర్ క్లస్టర్ లో బందుల దొడ్డి,అమాస్ వీధి, CSI స్కూల్ ప్రాంతాలల్లో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఇంటిఇంటికి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి వివరిస్తూ,స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎన్నికల మ్యానిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథం గా భావించి అందులోని ప్రతి హమీ ని తూచ తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వం మాత్రమే అని, పిల్లలు నుంచి పండు ముసలమ్మ వరకు ఆనందంగా ఇంట్లో ఉంటే తమకు రావాల్సిన తమ హక్కు గా పొందాల్సిన డబ్బులు స్వయంగా వాలంటీర్స్ తీసుకుని వచ్చి అందిస్తున్నారు అని అన్నారు. పిల్లలకు అమ్మ ఒడి,పెద్దలకు చేయూత, కాపు నేస్తం, అగ్రవర్ణ పేదలకు భరోసా, రైతులకు వాహన మిత్ర, రైతు భరోసా కేంద్రాలు, పెట్టుబడి సాయం,సబ్సిడీ ఎరువులు, వింతనాలు, కార్మికుల కు చేదోడు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రూపంలో మంచి చేయాలని తపించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, ప్రజలకు మంచి జరుగుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు అని ఎద్దేవాచేశారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొండ ప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజన్ అంతటికీ మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేలా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పెండింగులో ఉన్న నూతన మెట్ల మార్గాలు,రోడ్డు నిర్మాణాలు శంకుస్థాపన చేసి కొన్ని ప్రారంభించడం కూడా జరిగింది అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన,అర్హత ఉండి ఏ సంక్షేమ పధకం అందకపోయిన తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.ప్రజలు వద్దకు వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారుగత టీడీపీ ప్రభుత్వం లో స్థానిక ఎమ్మెల్యే నిధులు ఇవ్వకుండా అభివృద్ధి ని నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. మరలా ఇప్పుడు వైస్సార్సీపీ ప్రభుత్వం లో కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేపించి నూతన మెట్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు,మంచినీటి సమస్య పరిష్కారానికి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. మా పాలన మీద నమ్మకంతోనే మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు 2300 ఓట్ల మెజారిటీతో మాధురుని గెలిపించారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకొనేవిధంగా పని చేస్తామని భరోసా ఇచ్చారు.బాదుడే బాదుడు అనే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం బాదుడు మీద మాట్లాడేలేరని ఎందుకు అంటే రేపు పొత్తు లేనిదే పది సీట్లు కూడా రావ్వేమో అనే భయం అని, ఇప్పుడు మన ప్రభుత్వం ప్రజల ప్రతి రూపాయి వారికే ఇస్తుంటే చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ నేతల భాద ఏంటో అర్థం కావడం లేదని, గతంలో మాదిరిగా జేబులో వేసుకుని ప్రజల దగ్గర బాదకుండా వారి సోమ్ము వారికే ఎటువంటి దళారుల జేబులో కి పోకుండా అందివ్వడం జరుగుతుంది అని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే చేరుస్తున్న ఘనత జగన్ గారిదే అని,ఇంకోసారి మీ రాజకీయ మనుగడ కోసం ఇలాంటి షో రాజకీయాలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,సీనియర్ నాయకులు వేగి వెంకటేశ్వర రావు,వైస్సార్సీపీ నాయకులు సంపత్,శ్యామ్, సొంగా రాజ్ కమల్, ఉదయ్,క్లైవ్,శంకర్,మహిళా నాయకులు సుభాషిణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *