Breaking News

215 వ వార్డు సచివాలయం పరిధిలో రూ. 51.59 లక్షల సంక్షేమం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ లో పండుగ‌లా `గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్రభుత్వం`
-ఇంటింటికీ కదిలిన అధికార యంత్రాంగం
-ప్రజా ప్రభుత్వ కార్యక్రమాలకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం
-ప్రతీ గ‌డ‌ప‌కూ వెళ్లి ప్రజ‌ల స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గ‌డిచిన మూడేళ్లలో మేనిఫెస్టోలో చెప్పిన‌దానికంటే ఎక్కువ‌గా, పాద‌యాత్రలో ఇచ్చిన మాట‌కంటే మిన్నగా పాల‌న సాగిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్రభుత్వం’ కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో బుధవారం అట్టహాసంగా ప్రారంభ‌మైంది. కార్యక్రమంలో భాగంగా 33 వ డివిజన్ 215 సచివాలయం పరిధిలోని వీధులలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఎన్.ఆర్.పి.రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభించి ఓగిరాల వీధి, తిరుమలశెట్టి వీధి, జి.ఎస్.రాజు రోడ్డు, రామమందిరం వీధి, సుబ్బరావు వీధి, తాడంకి వీధి, స్కూల్ రోడ్డు, గడియారం వీధి, వ్యాకరణం వారి వీధి, ముదిగొండ వీధి, జి.ఎస్.రాజు రోడ్డు, శివాజీ కేఫ్ సెంటర్ వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సలహాలను, సూచనలను స్వీకరించారు. చివరి లబ్ధిదారుని వరకు పథకాలు అందుతున్నాయో లేదో వారినే అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ క‌ష్టకాలంలో సంక్షేమ సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జ‌న‌మంతా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ద్వారా కృత‌జ్ఞత‌లు తెలుపుతున్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలపై 90 శాతానికి పైగా ప్రజలు హర్షం వ్యక్తం చేయడం పట్ల ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా 10 శాతం ప్రజలకు కూడా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల పట్ల మరింత అవగాహన, చైతన్యం కల్పించారు. డివిజన్ లోని 215 వ వార్డు సచివాలయం పరిధిలో ఇప్పటివరకు 2,448 మంది లబ్ధిదారులకు రూ. 51.59 లక్షల సంక్షేమాన్ని అందించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. 176 మందికి వైఎస్సార్ పింఛన్, 164 మందికి అమ్మఒడి, 58 మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, 72 మందికి ఈబీసీ నేస్తం, 63 మందికి జగనన్న తోడు, 17 మందికి జగనన్న చేదోడు, 17 మందికి వైఎస్సార్ చేయూత, 10 మందికి కాపు నేస్తం, ఒకరికి వాహనమిత్ర పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. పథకాలు వర్తించని అర్హులందరికీ జూన్ మాసంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో మరింత సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడమే లక్ష్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకువచ్చినట్లు వివరించారు. మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదన్నారు. పేపర్‌ లీకేజీపై చట్టప్రకారమే పోలీసులు మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టప్రకారం వ్యవహరించినా.. ఎల్లో మీడియా గగ్గోలు పెడుతూ తప్పుడు రాతలు రాస్తోందని మండిపడ్డారు. మరీముఖ్యంగా ప్రతిపక్ష నేత దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. మాల్ ప్రాక్టీస్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మాట్లాడిన టీడీపీ నేతలు.. లీకేజీకి కారణమైన విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్టు చేస్తే వక్రీకరించి మాట్లాడుతున్నారన్నారు. పేపర్‌ లీకేజీపై పై ఏదో ప్రచారం చేయాలని చూస్తే వికటించి చివరకు తెలుగుదేశం నేతలకే తగిలిందన్నారు. కార్మికుల సొమ్మును దోచుకున్న అచ్చెన్నను, విద్యార్థుల భవితవ్యంతో ఆడుకుంటున్న నారాయణ వంటి వారిని చంద్రబాబు భుజానికెత్తుకోవడం సిగ్గుచేటన్నారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా ఈ ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. ఈ విషయంలో పోలీస్ అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పౌరులయినా, నాయకులయినా చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, ఇసరపు దేవి, ఉమ్మడి రమాదేవి, పెనుమత్స శిరీష, కుక్కల అనిత, ఉద్దంటి సునీత, కొంగితల లక్ష్మీపతి, జోనల్ కమిషనర్ రాజు, ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఎ.ఎం.ఓ.హెచ్.రామకోటేశ్వరరావు, ఆర్.ఐ.(సివిల్ సప్లయిస్) లలిత, ఏఈ(ఇంజనీరింగ్) వెంకటేష్, ఎస్సై దుర్గామహేశ్వరరావు, డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, నాయకులు శనగవరపు శ్రీనివాస్, కోలవెన్ను కొండ, సనత్, ఓగిరాల రాజశేఖర్, వి.భాగ్యారావు, కమ్మిలి రత్న, మాదాసు గోపాల్, కూనపులి ఫణి, మైలవరపు రాము, కొల్లూరు రామకృష్ణ, ఉప్పు రంగబాబు, బంగారి, చల్లాప్రగఢ సుబ్బారావు, పార్టీ శ్రేణులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *