-ప్రతి డివిజన్ కు రూ. 50 లక్షల నిధులు కేటాయింపు
-శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 40వ డివిజన్ నందు 15వ ఆర్ధిక సంఘ నిధుల నుండి రూ. 50 లక్షలు అంచనాలతో ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా పైప్ లైన్లు మార్పు పనుల శంకుస్థాపన కార్యక్రమములో పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పొరేటర్ తో కలసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంలో శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ లలో ఎన్నో సంవత్సరాల క్రితం వేసిన మంచినీటి పైపులైన్ లు పూర్తిగా పాడై లీకేజీలు ఏర్పడి త్రాగునీరు వృధా అవుతతూ, స్థానిక ప్రజలకు మంచినీటి ఇబ్బందులు ఎదురౌతున్న దృష్ట్యా మంచినీటి సరఫరా విధానo మెరుగుదలకై 15వ ఆర్దిక సంఘ నిధుల నుండి ప్రతి డివిజన్ కు రూ 50 లక్షలు కేటాయించుట జరిగిందని అన్నారు. అదే విధంగా నగర పరిధిలోని అన్ని డివిజన్ లను అభివృద్ధి పరిచే దిశగా వై.సి.పి ప్రభుత్వం పనిచేస్తుందని, డివిజన్ లలో డ్రెయిన్లు, రోడ్ల మర్మమ్మత్తులు వంటి అనేక అభివృద్ధి పనులతో పాటుగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకములు అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి వాటిని చేరువ చేసి, సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా లబ్దిదారులకు అందించుట జరుగుతుందని అన్నారు.
ప్రజలకు రక్షిత మంచినీరు అందించుటకు చర్యలు
పాతపైపుల స్థానములో కొత్త వాటర్ పైపులు ఏర్పాటు
మేయర్ రాయన భాగ్యలక్ష్మి
40వ డివిజన్ నందు పురాతన వాటర్ పైపులను తొలగించి కొత్త పైప్ లైన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయుట జరిగిందని, దీని వలన డివిజన్ నందు మంచినీటి సమస్యను పరిష్కరించుట జరుగుతుందని మేయర్ పేర్కొన్నారు. పైప్ లైన్ పనులు వేగవంతముగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలను తీర్చుటకై నగరపాలక సంస్థ అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుందని, నగరాభివృద్ధిలో తోడ్పాటు అందించాలని, మంచినీటిని వృదా చేయకుండా అధికారులతో అధికారులతో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయరెడ్డిలతో పాటుగా పలువురు కార్పొరేటర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, అధికారులు, స్థానిక పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News